RGV on Garikapati: గరికపాటికి పద్మ కూడా ఎక్కువే.. పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు? వర్మ సంచలన ట్వీట్లు
Ram Gopal Varma Satirical Comments on Garikapati Narasimha Rao: మెగాస్టార్ వివాదంలో రామ్ గోపాల్ వర్మ గరికపాటి నరసింహారావుని టార్గెట్ చేసి వరుస ట్వీట్లు చేసారు. ఆ వివరాల్లోకి వెళితే
Ram Gopal Varma Satirical Comments on Garikapati Narasimha Rao: మెగాస్టార్ చిరంజీవి -గరికపాటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కానీ గరికపాటి గాని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ట్వీట్ ను చూసుకొని మెగా అభిమానులు పెద్ద ఎత్తున గరికపాటి మీద యుద్ధం లాంటిది ప్రకటించి ఘాటు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే ఒక రోజు తర్వాత గరికపాటి ఏదో మూడ్ లో అలా అని ఉంటారని ఆయన చేత క్షమాపణలు చెప్పించుకోవడం మా ఉద్దేశం కాదని నాగబాబు ట్వీట్ చేశారు. దీంతో కొంతవరకు మెగా ఫ్యాన్స్ అయితే చల్లబడ్డారు. ఇక ఇప్పుడు అదే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ వరుసగా ఆసక్తికర ట్వీట్లు చేశారు. వరుస ట్వీట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ ‘’ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, *త్తగ్గేదెలె...*’ అంటూ ట్వీట్ చేశారు.
అలాగే ‘’హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో’’ అంటూ ఆయన ఘాటుగా కామెంట్ చేశారు. అలాగే ‘’హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి ’’, సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు అంటూ పేర్కొన్నారు.
సర్ నాగబాబుగారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ చిరంజీవి ???? అంటూ కామెంట్స్ చేసారు. అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ మాట్లాడారో తిడుతూ మాట్లాడారో కూడా అర్థం కాలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరి కొందరు వర్మ చేసిన ట్వీట్లు అర్థవంతంగా లేకపోవడంతో మందేసి వేసి వీటిని వేసావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Chiranjeevi Manager Gangadhar : చిరంజీవి మేనేజర్ తల్లి అదృశ్యం.. విన్నపం చేసిన గంగాధర్
Also Read: Court Notices to Prabhas: 'ఆదిపురుష్'కు మరో షాక్.. ప్రభాస్ సహా సినిమా యూనిట్ కు లీగల్ నోటీసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook