Skanda OTT Release Date: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన స్కంద సినిమా ఆడియెన్స్ ను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్సడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలో రామ్ సరసన టాలీవుడ్ సెన్షెషన్ శ్రీలీల హీరోయిన్‍గా నటించింది. ఇందులో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, ప్రిన్స్ సెసిల్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, పృథ్వీరాజ్  తదతరులు కీలకపాత్రలు పోషించారు.  ఊర్వశీ రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. స్కంద చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, జీస్టూడియోస్ బ్యానర్ల కింద శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన సమాచారం లీకైంది. స్కంద సినిమా డిజిటల్ రైట్స్ ను  ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‍స్టార్ దక్కించుకుంది. ఈ మూవీని అక్టోబర్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై డిస్నీ+ హాట్‍స్టార్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మూవీలో రామ్ యాక్షన్, డ్యాన్స్ లో ఇరగదీశాడు. అయితే ఈ మూవీ కథ, కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని ఫిలిం క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు.  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. 


Also Read: Maa Oori Polimera 2: సత్యం రాజేష్ 'మా ఊరి పోలిమేర 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి