Veera Simha Reddy First Single Jai Balayya Song : సోషల్ మీడియాలో ప్రస్తుతం నందమూరి, మెగా అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకునేలా ఉన్నాయి. ఒక్క చిన్న పాటలోనే ఇంత వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారు. బాస్ పార్టీ సాంగ్ తేలిపోవడం, జై బాలయ్య సాంగ్ కాస్త బెటర్‌గా అనిపించడంతో నందమూరి అభిమానులు సంబరపడుతున్నట్టుగా ఉన్నారు. అయితే జై బాలయ్య పాట ట్యూన్ ఒసేయ్ రాములమ్మ పాటకు దగ్గరగా ఉంది. కాపీ ట్యూన్ అనేట్టుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ పాటలోని లిరిక్స్‌ను మెగా ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఉదయం పూట అదే లిరిక్‌ను గోపీచంద్ మలినేని ట్వీట్ వేయడంతో.. పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పుడు ఈ పాటలోని లిరిక్స్ సైతం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అందుకే లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మీద మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టుగా అనిపిస్తోంది.


 



అలా అభిమానులు హద్దులు దాటడంతో రామజోగయ్య శాస్త్రి హర్టైనట్టు ఆయన ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను...దయచేసినన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించగలరు.. అన్నట్టు...జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్ధం నా పేరు ను  సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి గా మార్చుకున్నాను..ఇందులో ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండవలసిన అవసరం లేదు.. ఉంటే ఇటు రాకండి అంటూ దండం పెట్టేస్తోన్న ఎమోజీలను షేర్ చేశాడు.


జై బాలయ్య అంటూ సాగే ఈ పాటలో రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. రాయలోరి తేజం.. నిన్ను తాకే దమ్మున్నోడు లేనేలేడయ్యా.. ఆ మొల్తాడు కట్టిన మొగోడు ఇంకా పుట్టనే పుట్టలేదయ్యా.. అనే లిరిక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చిరు, బాలయ్య సినిమాలు సంక్రాంతికి మంటపెట్టేలా ఉన్నాయి.


Also Read : Itlu Maredumilli Prajaneekam Review : అల్లరోడి కొత్త సినిమా ఎలా ఉందో తెలుసా?


Also Read : Alia Bhatt Daughter Name : అలియా భట్ కూతురు పేరు ఏంటంటే?.. ఏ ఏ భాషలో ఏ ఏ అర్థమంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook