దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ పేరే 'కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. ఆయన తీస్తున్న తొలి అంతర్జాతీయ వెబ్ సిరీస్ అయిన ఈ చిత్రంలో కడపలో ఇప్పటి వరకు చెలరేగిన హత్యోదంతాలు, రక్తపుటేరులపై నూటికి నూటి శాతం నిజాలనే చూపించదలిచానని వర్మ ప్రకటించారు.  ‘కడప.. కడప..’ అంటూ వస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ వెబ్ సిరీస్‌‌కు హైలెట్‌గా నిలిచిందని ఇప్పటికే వర్మ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్‌అండ్‌ఎన్‌ క్రియేషన్స్‌, ఏ కంపెనీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. సినిమాలకు సెన్సార్ ఉండడం వల్ల చాలా సందర్భాల్లో తాను అనుకున్న అంశాలు చిత్రాల్లో చూపించడం కుదరలేదని.. అయితే వెబ్ సిరీస్ విషయంలో మాత్రం తన ఆలోచనలను తగ్గట్టుగా, భయం లేకుండా నిజాలు బట్టబయలు చేస్తానని వర్మ ప్రకటించారు.