Rana Daggubati to collaborate with Venkatesh for Rana Naidu: తన బాబాయ్‌ వెంకటేశ్‌తో స్క్రీన్ పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తన కల ఇన్నాళ్లకు నెరవేరింది అంటూ రానా తెలిపారు. దగ్గుబాటి రానా (Daggubati Rana), దగ్గుబాటి వెంకటేష్‌ (Venkatesh) కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనని ఇప్పుడు తేలిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రానా నాయుడు


ఆసక్తికరమైన అంశంతో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌కు రానా నాయుడు (Rana Naidu) అనే టైటిల్‌ పెట్టారు. ఈ వెబ్‌ సిరీస్‌ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ వెబ్‌ సీరిస్‌ రానుంది.



 


Also Read : Viral video: అధికార మదం...గ్రామ సమస్యల గురించి అడిగితే బూటుకాలితో తన్నిన సర్పంచ్.!


నిషా అగర్వాల్‌ రీ ఎంట్రీ


ఈ వెబ్‌ సిరీస్‌తో కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ (nisha agarwal )రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా సినిమాలకు దూరమైన నిషా ఈ వెబ్‌ సిరీస్‌తో మరోసారి స్కీన్‌పై తళుక్కుమననుంది. ఇక ఇందులో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన గెటప్‌ కూడా అదిరింది. ఓల్డ్ మ్యాన్ లుక్‌లో వెంకీ కిరాక్‌గా కనిపిస్తున్నారు. రానా తన ముందే పెద్దోడు అయి మంచి యాక్టర్‌‌గా ఎదగారని వెంకటేష్‌ పేర్కొన్నారు. రానా (Rana) నాయుడులో అతని ఫర్మామెన్స్ బాగుంటుందని చెప్పుకొచ్చారు వెంకీ.



Also Read : ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook