Rana Daggubati Upcoming Movies: బాహుబలి సినిమాతో రానా దగ్గుబాటి పేరుకి.. పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకున్నారు కానీ.. ఆ తర్వాత ఆ రేంజ్ సినిమాల్లో.. మాత్రం కనిపించలేదు. బాహుబలి 2 తర్వాత కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నారు రానా. మళ్లీ 1945, భీమ్లా నాయక్, విరాటపర్వం అంటూ లోకల్ సినిమాలు తీశారు. అయితే అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి.  ఇక ఆ తరువాత.. కొద్ది రోజులకే కనుమరుగైపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తరువాత రానా నాయుడు అంటూ ఒక వెబ్ సిరీస్ లో కనిపించారు కానీ.. ఫ్యామిలీ ప్రేక్షకులను మాత్రం ఆ వెబ్ సిరీస్ అలరించలేకపోయింది. ఇక రానాని మళ్ళీ ఎప్పుడు వెండి తెర మీద చూస్తామా.. అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానా దగ్గుబాటి ఫైనల్ గా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి కిషోర్ అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో.. ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా హారర్ ఎలిమెంట్లు కలిగి ఉంటుంది అని.. అవి ప్రేక్షకులకు ఖచ్చితంగా భయం కలిగించేలా ఉంటాయి..అని వార్తలు వినిపిస్తున్నాయి. రానా ఇప్పటిదాకా హారర్ సినిమాల్లో నటించలేదు. 


కొత్త జోనర్ లో రానా సినిమా కాబట్టి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి తో సక్సెస్.. అందుకున్న ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించి.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే ప్లాన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటనలతో పాటు సినిమా నటినటులు, టెక్నీషియన్ల వివరాలు బయటకు రానున్నాయి.


మరోవైపు రానా దగ్గుబాటి.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు సీజన్ 2 చేస్తున్నా సంగతి తెలిసిందే. మొదటి సీజన్ తోనే బోలుడు వివాదాల్లో.. ఇరుక్కున్న రానా ఈసారి ఇంకెన్ని వివాదాల్లో ఇరుక్కుంటారు అని వేచి చూడాలి.


Also Read: Tirumala: తిరుపతి వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మాసం రూ. 300 దర్శనం టిక్కెట్ల షెడ్యూల్‌ విడుదల..  


Also Read: Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.