Rana Daggubati-Teja Movie: రెండు పార్టులుగా రానా-తేజ మూవీ?
![Rana Daggubati-Teja Movie: రెండు పార్టులుగా రానా-తేజ మూవీ? Rana Daggubati-Teja Movie: రెండు పార్టులుగా రానా-తేజ మూవీ?](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2023/07/06/277327-rana-teja-movie.png?itok=cuBI8yBc)
Rana Daggubati: రానా దగ్గుబాటి-తేజ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. దీనికి సంబంధించిన పనులు త్వరలో మెుదలుపెట్టినున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Rana Daggubati Upcoming Movies: 'నేనే రాజు నేనే మంత్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ విషయాన్ని తేజ నేరుగా దగ్గుబాటి అభిరా హీరోగా తెరక్కెక్కిన అహింస సినిమా ప్రీరిలిజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది.
ఈలోపే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేమంటే ఈ సినిమాకు రాక్షసరాజు అనే టైటిల్ పెట్టారని.. అంతేకాకుండా ఇది రెండు భాగాలుగా రాబోతుందని ఫిలిం సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. కథ పెద్దదని అందుకే రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రానా ఈ మధ్యనే నిఖిల్ స్పై చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
Also Read: స్పై రిజల్ట్ ఎఫెక్ట్.. ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్..
ప్రస్తుతం రానా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. విరాటపర్వం, రానానాయుడుల తర్వాత రానా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన రానా నాయుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తేజ సినిమా కంటే ముందు గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' అనే సినిమా చేయాల్సి ఉంది. అయితే గుణశేఖర్ రీసెంట్ గా తెరకెక్కించిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో హిరణ్య కశ్యప సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు తేజ.. రానా తమ్ముడు అభిరామ్ తో అహింస అనే చిత్రం చేశారు. ఇది కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook