Animal Movie first Single update: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)-అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబోలో వస్తున్న మూవీ యానిమల్’(Animal). ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన (Rashmika Mandana) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యాన‌ర్‌పై భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా డిసెంబరు 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్(Animal Movie first Single update)ను ప్రకటించారు మేకర్స్.  అమ్మాయి అంటూ సాగే ఓ మెలోడియస్‌ సాంగ్‌ను బుధవారం రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ప్రైవేట్‌ జెట్‌లో రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌ చేసుకుంటున్న ఫోటోను వదిలారు మేకర్స్. ఈ సినిమాకు మనన్ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో రణ్ బీర్ కు తండ్రిగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటించారు. ఇందులో బాబీ డియోల్, సీనియర్ న‌టుడు పృథ్వీ రాజ్ విల‌న్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా మార్కు కనబడుతుంది. 



Also Read: Dil Raju Father Passed Away: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఇంట తీవ్ర విషాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook