pathaan OTT Release Date : ఈ వారం ఓటీటీ, థియేటర్ సినిమాలు.. అక్కడా ఇక్కడా ఇంట్రెస్టింగ్ సినిమాలివే
pathaan OTT Release Date బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్లీ తలెత్తుకునేలా చేసింది పఠాన్ సినిమా. షారుఖ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సంచలనాలు క్రియేట్ చేసేందుకు వస్తోంది.
pathaan OTT Release Date ఈ వారం ఓటీటీ, థియేటర్లో మంచి చిత్రాలే వస్తున్నాయి. రిపబ్లిక్ డేకు విడుదలైన పఠాన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరిలో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ కూడా ఓటీటీలోకి రాబోతంది. థియేటర్లో అయితే విశ్వక్ సేన్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. కృష్ణవంశీ చాలా ఏళ్ల తరువాత తన మార్క్ చూపించేందుకు వస్తున్నాడు. రంగమార్తాండ సినిమాతో కృష్ణవంశీ మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు.
థియేటర్లో ఈ వారం విశ్వక్ సేన్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన దాస్ కా దమ్కీ సినిమా రాబోతోంది. మార్చి 22న ఈ సినిమాను థియేటర్లో విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కృష్ణ వంశీ తెరకెక్కించిన రంగమార్తాండ (మరాఠీ నట సామ్రాట్ రీమేక్) ఈ వారమే థియేటర్లోకి రానుంది. ఇప్పటికే వేసిన ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. మరి థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
ఓటీటీలో ఈ వారం కుప్పలు తెప్పలుగా సినిమా రాబోతోన్నాయి. వీటిలో ముఖ్యంగా కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 22 నుంచి ఈ చిత్రం ఆహాలోకి రానుంది. ఇక షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా సైతం మార్చి 22న అమెజాన్‌లోకి రాబోతోంది. ఈటీవీ విన్ యాప్‌లో పంచతంత్రం కథలు అనే సినిమా రాబోతోంది.
ఆహాలో డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా రాబోతోంది. హంటర్ అనే హిందీ సిరీస్ అమెజాన్‌లో రానుంది. నెట్ ఫ్లిక్స్‌లో వుయ్ లాస్ట్ అవర్ హ్యుమన్ మార్చి 21న, వాకో: అమెరికన్ అపకాలిప్స్ మార్చి 22న,
ద నైట్ ఏజెంట్ మార్చి 23న, చోర్ నికల్ కే భాగా మార్చి 24న ఇలా ఇంకొన్ని చిత్రాలు సందడి చేయనున్నాయి.
Also Read: Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన
Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook