Rangasthalam makers missed a Golden opportunity at that Time: రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో విడుదలైంది. అక్కడ మంచి హిట్ అవడంతో దీన్ని తెలుగు, మలయాళ , హిందీ భాషల్లో కూడా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారు. మొదటి ఆట నుంచే ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కుతున్నాయి. నటీనటుల అద్భుతమైన నటన సినిమా నేరేషన్ అలాగే సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ కాంతార సినిమా చూసిన తర్వాత తెలుగు అభిమానులు అందరూ ఈ సినిమాకు తెలుగులో విడుదలైన రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. కథ కొంచెం ఒకలాగే అనిపించిందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంతార సినిమా  తెలుగు సహా మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో రంగస్థలం సినిమాని హిందీ అలాగే ఇతర భాషల్లో విడుదల చేయకుండా తప్పు చేశారేమో అనే వాదన వినిపిస్తోంది.


ఒకవేళ విడుదల చేసి ఉంటే పుష్ప, కేజీఎఫ్, కాంతార లాగానే ఆ సినిమా కూడా మంచి వసూళ్ల వర్షం కురిపించడమే కాక తెలుగు నుంచి మరో మంచి సినిమాను అందించినట్టు ఉండేదని ఇప్పుడు కొందరు అభిప్రాయపడుతున్నారు. రంగస్థలం సినిమా కూడా పుష్పలాగానే పూర్తిస్థాయి రా, రస్టిక్ సినిమా కావడంతో మొదట ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటే దాదాపుగా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసింది. అందుకే ఇప్పుడు కాంతార సినిమా చూసిన తర్వాత రంగస్థలం ఒక మంచి అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇక పోల్చి చూస్తే ఈ రెండు సినిమాలు దాదాపుగా రివెంజ్ డ్రామా చుట్టూ తిరుగుతాయి.


అలాగే రెండు సినిమాల్లో హీరో సోదరుడిని హీరో బాగా నమ్మే దగ్గర వ్యక్తి చంపేస్తాడు, దీంతో అతని మీద పగ తీర్చుకోవడం కోసం హీరో అప్పటివరకు తాను బాస్ గా ఫీలయ్యిన వ్యక్తినే చంపేస్తాడు. అయితే ఈ రెండు సినిమాల్లో ఈ పాయింట్స్ మాత్రమే కామన్ కాగా ప్రేక్షకులు మాత్రం రంగస్థలం లాగానే ఉంది అనే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే రంగస్థలం పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయకుండా తప్పు చేశారేమో అనే వాదన వినిపిస్తోంది. నిజానికి కొన్నాళ్ల తరువాత రంగస్థలం సినిమాను తమిళ సహా కొన్ని బాషలలో విడుదల చేసినా క్రేజ్ ఉన్నప్పుడే రిలీజ్ చేసి ఉంటే బాగుండని కొందరు అభిప్రాయపడుతున్నారు. 


Also Read: Kantara Telugu Openings: 'కాంతార'ను హత్తుకున్న తెలుగోడు.. కన్నడ కంటే మనదగ్గరే ఎక్కువ ఓపెనింగ్స్!


Also Read: Ram Charan Praises Vishwak: నేను విశ్వక్ ఫాన్.. మాస్ కా దాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook