Producer Balaji Nagalingam sensational comments on Rashmi Gautam: రష్మి గౌతమ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ముందుగా సినిమాల్లో సహానటి పాత్రలు చేసిన రష్మీ.. ఆ తర్వాత యాంకరింగ్‌ వైపు వచ్చారు. ప్రముఖ కామెడీ షో ఢీతో యాంకర్‌గా మారిన ఆమె.. తన అందచందాలతో ఆకట్టుకున్నారు. సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ట్రాక్‌ ఆమెను మరింత పాపులర్‌ చేసింది. రష్మీ ఓ వైపు యాంకరింగ్‌ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. హీరోయిన్‌గా గుంటూర్‌ టాకీస్‌, అంతం వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం రష్మీకి వచ్చింది. అయితే రష్మీ గురించి ఒక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రాణి గారి బంగ్లా' సినిమా చేసేటప్పుడు రష్మీ తనను బెదిరించే ప్రయత్నం చేసిందని సీనియర్‌ నిర్మాత బాలజీ నాగలింగం షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. రష్మీ తనను బెదిరించిన కాల్ రికార్డ్ ఇంకా తన దగ్గర ఉందని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న నిర్మాత బాలజీ నాగలింగం మాట్లాడుతూ... 'రాణి గారి బంగ్లా సినిమా షూటింగ్ చేసేటప్పుడు రష్మీ నాతో దురుసుగా ప్రవర్తించారు. సినిమా సగం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యాక ఓ సాంగ్ చేశాం. అందులో నేను నటించనని, హీరోను మార్చమని గొడవ పడింది. సినిమా షూటింగ్ అయ్యాక హీరోను ఎలా మారుస్తామని నచ్చజెప్పినా.. అసలు వినలేదు. షూటింగ్ క్యాన్సిల్, నేను రాను అంది' అని చెప్పారు. 


'నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు అని రష్మీ నన్ను బెదిరించింది. అప్పుడు నేను కూడా కోప్పడ్డాను. సినీ ఇండస్ట్రీలో ఇనాళ్లుగా ఉంటున్నాను.. నాగబాబు, శ్యామ్ నాక్కూడా తెలుసు. షూటింగ్ మధ్యలో ఆపేస్తే కేసు పెడతా.. ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని నేను అన్నాను. దాంతో రష్మీ దిగివచ్చి షూటింగ్ పూర్తిచేసింది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే.. నా వ‌య‌సెంత‌, ర‌ష్మీ వ‌య‌సెంత‌. నేను చొంగకార్చుకునే టైప్ కాదు. శ్రీదేవి గారు, రాధ‌ గారు వంటి గొప్పగొప్ప హీరోయిన్స్‌ను చూశాను. వాళ్లు టైమింగ్ అంటే టైమింగ్‌' అని సీనియర్‌ నిర్మాత పేర్కొన్నారు. 


'మనం ఎదుటి వ్య‌క్తిని తిట్టామంటే మ‌నం ఎంత బాధ‌ప‌డి ఉన్నామో అర్థం చేసుకోవాలి. నేను ఎదుటి వ్య‌క్తిని ఎప్పుడూ గౌరవిస్తా. సాధార‌ణంగా నేను ఎదుటి వ్య‌క్తిని తిట్టను. కోపం వ‌చ్చినా కంట్రోల్ చేసుకుంటాను. ప‌క్క‌కు వెళ్లి గ‌ట్టిగా తిట్టుకుని టెన్ష‌న్ త‌గ్గించుకుంటా. ర‌ష్మీని తిట్టానంటే నాకు ఎంత కోపం వచ్చిందో మీరే అర్ధం చేసుకోండి' అని నిర్మాత బాలజీ నాగలింగం చెప్పుకొచ్చారు. 


Also Read: IPL 2022 New Rules: డీఆర్ఎస్, సూపర్ ఓవర్‌లో కీలక మార్పు.. ఐపీఎల్ 2022 నయా రూల్స్ ఇవే!!


Also Read: Rashmika Mandanna: యువ హీరోతో రష్మిక మందన్న రొమాన్స్.. సూపర్ కాంబో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook