Cirkus Movie Day 1 Collections బాలీవుడ్‌కు ఈ ఏడాది ఓ పీడకలలా మారింది. ఎన్ని సినిమాలు వచ్చాయో అన్ని సినిమాలు బోల్తా కొట్టేశాయి. వంద సినిమాలు వస్తే 99 చిత్రాలు డిజాస్టర్లుగానే నిలిచాయి. అలా బాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు నీచాతి నీచ స్థితికి చేరింది. ఇప్పుడంతా కూడా సౌత్ డామినేషనే కనిపిస్తోంది. నార్త్ ఆడియెన్సే బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేసేస్తున్నారు. బాలీవుడ్ నెపొటిజం, స్టార్ కిడ్ల హల్చల్, సుశాంత్ రాజ్‌పుత్ వంటి హీరోలను తొక్కేయడంతో నార్త్ ఆడియెన్స్‌కు చిరాకు పుట్టుకొచ్చింది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలను అక్కడ తిరస్కరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాలు సైతం దారుణంగా బోల్తా కొడుతున్నాయి. కుర్ర హీరోలు, పెద్ద హీరోల సినిమాలన్నీ బోల్తా పడుతూనే వస్తున్నాయి. ఈ ఏడాదిలో అజయ్ దేవగణ్ దృశ్యం 2  సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక బ్రహ్మస్త్ర సినిమా కేవలం హిట్టుగానే నిలిచింది. ఇక మిగిలిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగానే మిగిలియా. ఫ్లాప్ అయిన లిస్టులో చాలానే సినిమాలున్నాయి.


అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో అక్షయ్ లుక్స్, పెట్టుడు మీసం, పూర్ వీఎఫ్ఎక్స్ వంటివి ట్రోలింగ్‌కు గురయ్యాయి. జెర్సీ సినిమా ఎమోషనల్‌గా ఉన్నా కూడా కలెక్షన్లను రాబట్టలేక తుస్సుమంది. జయేషీభాయ్ జోర్డార్ అంటూ రణ్ వీర్ సింగ్ చేసిన సందడి వర్కౌట్ కాలేదు. అటాక్ సినిమా తుస్సుమంది. జాన్ అబ్రహం ఓవర్ యాక్షన్ కూడా దానికి ఓ కారణం. హేరాపంతి, థాంక్ గాడ్, థాకడ్, షంషేరా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకున్నాయి.


ఇక నిన్న విడుదలైన రోహిత్ శెట్టి సర్కస్ సినిమాకు కూడా డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలే రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డేలు బ్యాడ్ లక్‌ టైంలో ఉన్నారు. దీంతో సర్కస్‌కి కూడా ఆ బ్యాడ్ టైం అంటుకున్నట్టుంది. ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా డిజాస్టర్‌ కానుందని అర్థమైంది. మరి వచ్చే ఏడాది అయినా బాలీవుడ్‌కు కలిసి వస్తుందా? లేదా? అన్నది చూడాలి. షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్.. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాలు హిట్ అవుతాయో లేదో మరి.


Also Read : Pawan Kalyan in Unstoppable : ఆ ప్రశ్నలు మాత్రం అడగకండి!.. బాలయ్యకు పవన్ రిక్వెస్ట్?


Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook