Rao Ramesh Helps his Expired Makeup Man's Familly with 10 Lakhs: రావు గోపాలరావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఆలస్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన నటుడిగా తన సెపరేట్ మేనరిజంతో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యారు. తాజాగా ఆయన తన గొప్ప మనసు చాటుకున్న వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ కన్నుమూశారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఆయన కుటుంబానికి అండగా నిలవాలని రావు రమేష్ నిర్ణయం తీసుకున్నారు. తన దగ్గర మేకప్ మేన్ గా పని చేస్తున్న బాబు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన రావు రమేష్ ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలు చెక్ కూడా కుటుంబానికి అందించి ఆర్థిక సహాయం చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఇప్పుడు ఆర్థిక సహాయం చేసి తప్పుకోవడమే కాదు ఇక మీదట కూడా ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించమని అభయం ఇచ్చారట.


ఇక రావు రమేష్ చేసిన పనికి ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రావు రమేష్ ఇలా మీడియాలో సినిమాలకు మించిన వార్తలలో కనిపించడం ఇదే మొదటిసారి. ఆయన ఎక్కువగా మీడియాకి ఎక్స్పోజ్ అవ్వరు. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.


తండ్రి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు అద్భుతమైన నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కేజిఎఫ్ లాంటి సినిమాతో ఆయన పాన్ ఇండియా లెవెల్ కి కూడా ఎదిగారు. పుష్పలో కూడా రావు రమేష్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అలా తెలుగు నటుడు అయిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు.


Also Read: Mahesh Babu and Sitara: జీ తెలుగు కోసం కుమార్తెతో కలిసి మహేష్ స్పెషల్ వీడియో.. గుండె పిండేశారు భయ్యా!


Also Read: Sonal Chauhan Injured: షూటింగ్లో నాగ్ హీరోయిన్ కి గాయాలు.. అసలు ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి