RAPO 19 Titled as The Warrior: యంగ్ హీరో రామ్‌, డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్​ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. ఇప్పుడా సినిమా టైటిల్ ను చిత్రబృందం రివీల్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటిస్తున్న ఈ చిత్రానికి 'ది వారియర్' అని టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా టైటిల్ తో పాటు ఇందులో హీరో రామ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అందులో ఇంటెన్స్ లుక్ తో రామ్ ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. 



పవన్‌ కుమార్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడం సహా సామాజిక సందేశాన్ని అందివ్వనుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 


ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 


'ఉప్పెన'తో తెలుగు తెరపై ఎగసిన కొత్త అందం కృతి శెట్టి. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారుల మతి పోగొట్టింది. ఈ సినిమాలో రామ్ సరసన ఈ చిన్నదే హీరోయిన్‌గా సందడి చేయనుంది. మరోవైపు హీరో రామ్​ వరుస హిట్లతో జోష్​ మీద ఉండటం, ఈ కొత్త జోడీ కలయిక వల్ల అభిమానుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. 


Also Read: Ala Vaikunthapurramuloo Hindi Release: హిందీ ప్రేక్షకుల కోసం అల..వైకుంఠపురంలో మూవీ రిలీజ్


Also Read: Janhvi Kapoor Swimsuit: వీకెండ్ వైబ్స్.. స్విమ్‌ సూట్‌లో జాన్వీ కపూర్ అందాల విందు!! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook