Rashmika Mandana Suffering with Knee Pain: ఈ మధ్యకాలంలో వరుసగా హీరోయిన్లు అనారోగ్యంతో హాస్పిటల్ పాలవుతున్న ఘటనలు తరచూ విం1wటూనే ఉన్నాం. సమంత అయితే శస్త్ర చికిత్స కోసం విదేశాలకు వెళ్ళినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా రష్మిక మోకాలుకి గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వైద్యుడు గురవారెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ వేదిక ద్వారా వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ ఏవి గురవ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్స్ కి ఎండిగా ఉన్న ఆయన అదే హాస్పిటల్స్ కి చీఫ్ సర్జన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో ఆయన అనేక మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కరోనా మీద అనేక విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన రష్మిక తన హాస్పిటల్ కి వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 


 నువ్వు స్వామి స్వామి అంటూ మోకాళ్ల మీద బరువు అంతా వేసి డాన్స్ చేయడం వల్ల ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి అంటూ తన దగ్గరకు వచ్చిన రష్మికకు చెప్పానని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే రష్మిక మోకాలు నొప్పి చికిత్స కోసం వచ్చిందంటూ ఆయన పేర్కొన్నారు. పుష్ప సినిమా చూసిన మొదలు రష్మికని కలిసే అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలు నొప్పి ద్వారా ఆ సందర్శనం దొరికింది అంటూ ఆయన పేర్కొన్నారు. 


 అంతేకాక బన్నీ కూడా త్వరలో షోల్డర్ పై ఎంతో వస్తాడేమో అంటూ ఒక హాస్యోక్తి కూడా ఆయన విసిరారు. ఈ సందర్భంగా రష్మీకతో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు ఆయన. ఆయన షేర్ చేసిన వెంటనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక మందన మోకాలికి ఏమైంది ఆమె ఎందుకు హాస్పిటల్ కి వెళ్ళింది అంటూ అభిమానులందరూ ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. అయితే రష్మిక ఆరోగ్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోకాళ్ళ మీద ఒత్తిడి పెరగడంతోనే ఆమెకు మోకాలి నొప్పి స్టార్ట్ అయిందని తెలుస్తోంది. 


Also Read:  Bigg Boss 6 Elimination: షాకిచ్చిన బిగ్ బాస్... ఊహించని కంటెస్టెంట్ ఔట్!


Also Read:  Hollywood Actors in Mahesh Movie: మహేష్ మూవీలో తొర్.. ఒక రేంజ్ లో ప్లాన్ చేసిన జక్కన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook