Rashmika Mandanna Controversy రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మొన్నటి వరకు కన్నడ బ్యాన్ వార్తలతో రష్మిక ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కేసింది. కాంతారా సినిమాను చూడలేదని ఓ సందర్భంలో రష్మిక చెప్పింది. మరో సందర్భంలో తన ఫస్ట్ ప్రొడక్షన్ కంపెనీ పేరు కూడా చెప్పకుండా రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టిలను చులకనగా చేసినట్టు మాట్లాడేసింది. దీంతో కన్నడలో రష్మికను బ్యాన్ చేయాలనే వాదన తెర మీదకు వచ్చింది. చివరకు రష్మిక ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీడియా అడిగినప్పుడు నేను కాంతారా సినిమా చూడలేదు.. ఇప్పుడు చూశాను.. నాకు నచ్చింది.. అదే విషయాన్ని టీంకు మెసెజ్ చేసి చెప్పాను.. థాంక్యూ అని వారు కూడా రిప్లై ఇచ్చారు.. ఇప్పటి వరకు అయితే నన్ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు అని చెప్పుకొచ్చింది రష్మిక. పర్సనల్ జీవితాల కంటే.. నేను ప్రొఫెషనల్ లైఫ్ మీద జనాలు చేసే కామెంట్లను ఎక్కువగా తీసుకుంటాను.చ. ఎందుకంటే నేను వారిని ఎంటర్టైన్ చేయాలని భావిస్తుంటాను అని రష్మిక చెప్పుకొచ్చింది.


అయితే రష్మిక ఇప్పుడు మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. రష్మిక తాజాగా బాలీవుడ్ సాంగ్స్, సౌత్ సాంగ్స్ మధ్య పోలికలు చెప్పింది. మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్‌, సాంగ్స్ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మాట్లాడుతూ వచ్చింది. రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని.. సౌత్‌లో ఎక్కువగా మాస్, మసాలా కమర్షియల్‌ హంగులే ఉంటాయని కించపరిచినట్టుగా చెప్పేసింది. దీంతో మరోసారి రష్మిక ట్రోలింగ్‌కు గురవుతోంది.


కన్నడ నుంచి సౌత్‌కు వచ్చాక.. కన్నడను తక్కువ చేసిన మాట్లాడుతున్నావ్.. ఇప్పుడు సౌత్ నుంచి నార్త్‌కి వెళ్లిన తరువాత సౌత్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్.. సౌత్ సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ లేవా? ఇక్కడి వాళ్లు తెరకెక్కించలేరా? ఇప్పుడు అంతా సౌత్ హవా నడుస్తోంటే.. నీకు బాలీవుడ్ నచ్చిందా? అంటూ ఇలా నానా రకాలుగా రష్మికను ఆడేసుకుంటున్నారు.


Also Read : Harish Shankar : సార్ ప్లీజ్ సార్.. అడుకుంటున్నా పట్టించుకోని అధికారులు.. హరీష్‌ శంకర్ అసహనం


Also Read : Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook