Rashmika Mandanna Pushpa : పుష్ప 2 నుంచి హీరోయిన్‌ను తీసేశారా?.. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందాన్న
Rashmika Mandanna Pushpa రష్మిక మందాన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెప్పించింది. పుష్ప రాజ్ పాత్రతో పాటుగా శ్రీవల్లి కారెక్టర్ కూడా జనాలకు బాగానే ఎక్కేసింది. ఇక శ్రీవల్లి పాట ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Rashmika Mandanna Pushpa అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఖండాంతరాలు దాటి మన పుష్ప రాజ్ మేనియా, స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. పుష్ప, శ్రీవల్లి స్టెప్పులు అందరూ వేసేశారు. పుష్ప సినిమాకు అనూహ్యమైన విజయం దక్కింది. దీంతో రెండో పార్టును జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అందుకే సినిమా ఆలస్యం అవుతూనే వస్తోంది. ఈ మధ్యే సినిమా షూటింగ్ మొదలైంది.
డిసెంబర్‌లో ఈ రెండో పార్టును ఓ ఐదు రోజులు తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. సుకుమార్ భార్య తబిత.. ఇచ్చిన అప్డేట్‌ను బట్టి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందనిపిస్తోంది. ఈ మధ్య పుష్ప ది రూల్ మీద కొన్ని వింత రూమర్లు వచ్చాయి. హీరోయిన్‌గా రష్మిక మందాన్నను తీసేశారని, వేరే హీరోయిన్‌ను చూసుకుంటున్నారని రూమర్లు వచ్చాయి.
[[{"fid":"258938","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
వీటిపై పరోక్షంగా రష్మిక స్పందించినట్టు అయింది. తాజాగా రష్మిక మందాన్న తన అభిమానులతో నెట్టింట్లో ముచ్చట్లు పెట్టేసింది. తాజాగా ఇన్ స్టాగ్రాంలో రష్మిక తన అభిమానులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ప్రస్తుతం నువ్ చేస్తున్న ప్రాజెక్టులు ఏంటి? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రష్మిక ఇలా సమాధానం ఇచ్చింది. తాను ప్రస్తుతం పుష్ప ది రూల్, మిషన్ మజ్ను, వారసుడు, యానిమల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నట్టుగా ప్రకటించింది రష్మిక.
అంటే పుష్ప పార్ట్ 2లో తనను ఎవ్వరూ తీసేయలేదని, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను అంటూ చెప్పకనే చెప్పేసినట్టు అయింది. ఇప్పటికైనా ఈ రూమర్లు ఆగుతాయో లేదో చూడాలి. రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర లేకుండా పుష్ప పార్ట్ 2 ఊహించుకోవడం కాస్త కష్టమే. ఇక ఈ పాత్రను రెండో పార్టులో చంపేస్తారనే టాక్ కూడా ఉంది. మరి సుకుమార్ లెక్కలు ఎలా ఉన్నాయో చూడాలి.
Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి