Rashmika Mandanna-Anand Devarakonda: విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమలో ఉన్నారని ఎన్నో రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎప్పుడూ కానీ ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. అయితే వీరిద్దరూ షేర్ చేసే ఇంస్టాగ్రామ్ ఫోటోలు అలానే రష్మిక ఇంటర్వ్యూలో చెప్పే మాటలు వింటే.. చిన్నపిల్లలకి కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఏదో ఒక రకంగా తమ ప్రేమ గురించి హింట్స్ ఇస్తూనే ఉంటారు వీరిద్దరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా గతంలో విజయ్ దేవరకొండ అమ్మను రష్మిక తన సెకండ్ మదర్ అనడంతో.. అప్పుడే చాలామంది 100 పర్సెంట్ వీరిద్దరి ప్రేమ గురించి ఫిక్స్ అయిపోయారు. కాగా ఇప్పుడు మరోసారి రష్మిక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పై మరికొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.


అసలు విషయానికి వస్తే నిన్న ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన గం గం గణేశా ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో రష్మికని పలు ప్రశ్నలు అడిగాడు ఆనంద్ దేవరకొండ. రష్మిక తన పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. వాటిలో రష్మిక పెట్ డాగ్, విజయ్ పెట్ డాగ్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోలు చూపించి ఆనంద్ దేవరకొండ..వాటిలో ఏది ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పుకొచ్చింది.


అలాగే నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అంటూ ఆనంద్ దేవరకొండ అడగగానే.. రష్మిక మైక్ పక్కన పెట్టి నీ యబ్బ అని ఆనంద్ ని సరదాగా తిట్టింది. ఇక ఆ తరువాత వెంటనే మైక్ లో.. ‘ఆనంద్ నువ్వు నా ఫ్యామిలిరా, ఇలా స్పాట్ లో పెడితే ఎలా’ అంటూ చాలా క్యూట్ గా అనడంతో.. అక్కడ వచ్చిన అభిమానులంతా ఓ అంటూ అడగడం మొదలు పెట్టాడు. ఇక చుట్టూ ఉన్న జనాలు అందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరవడంతో రష్మిక.. రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్ ని ఉద్దేశించి చెప్పింది. 


కాగా ఆనంద్ ని నువ్వు నా ఫ్యామిలిరా అని రష్మిక ఓపెన్ గా చెప్పడంతో రష్మిక విజయ్తో ఉన్న తన రిలేషన్షిప్ అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేసింది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
 



 


Also Read: POCSO Court: సొంత మనవరాలిపై తాతయ్య అఘాయిత్యం.. విశాఖ కోర్టు సంచలన తీర్పు


Also Read: Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter