Rashmika Mandanna: గ్లోబల్ లెవల్లో రష్మిక మందన్న క్రేజ్.. మిలాన్ ఫ్యాషన్ వీక్ టాప్ 10 బ్రాండ్స్‌లో రష్మిక ఒనిట్సుక టైగర్ బ్రాండ్..
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ఈమె బ్రాండింగ్ చేస్తోన్న ఒనిట్సుక టైగర్ వరల్డ్ టాప్ 10లో ఒకటిగా నిలిచింది.
Rashmika Mandanna: రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అది రష్మిక విషయంలో అది అక్షరాల నిజం. ఈమె నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా ఈమధ్య కాలంలో ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను', చివర్లో 'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. తాజాగా ఈ భామ క్రంచిర రోల్ అనిమీ అవార్డ్స్‌లో భాగంగా భారత్ తరపున జపాన్ దేశంలోని టోక్యో వెళ్లింది రష్మిక మందన్న. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మనదేశం నుంచి రష్మిక రిప్రెజెంట్ చేసింది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక నిలిచింది. తాజాగా రష్మిక బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో టాప్ 10 బ్రాండ్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ లిస్టును విడుదల చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసినప్పుడు రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో ఉండటం విశేషం.ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ప్రకారం ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ 75 లక్షల డాలర్ల వర్త్ కలిగి ఉందట. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రష్మిక మందన్న ర్యాంప్ పై వాక్ చేసింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ను రశ్మిక ప్రమోట్ చేసింది. పుష్ప , యానిమల్ మూవీస్ తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన్న. ఈ క్రమంలోనే ఆమెకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది రష్మిక మందన్న.
ప్రస్తుతం రష్మిక మందన్న "పుష్ప 2", "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాలతో పాటు ఓ హిందీ ప్రాజెక్ట్ లోనూ నటిస్తోంది.రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికైన రష్మిక.. హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది. యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 40 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
రష్మిక మందన్న కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అటు ఆంగ్ల సాహిత్యం, జర్నలిజంలో కూడా బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈమె తల్లిదండ్రులు వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటారు. ఈమెకో చిట్టి చెల్లెలు కూడా ఉంది. ఈమె వీలునపుడల్లా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో గడపడానికే ప్రాధాన్యత ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter