Samantha Rashmika talks Shaakuntalam Trailer సమంత నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్‌ను సోమవారం నాడు విడుదల చేశారు. గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాను నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ అంతగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదనిపిస్తోంది. ఆ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ చూస్తుంటే కొత్తగా అనిపించడం లేదని, సెట్స్ కూడా బాహుబలి సినిమాలోలానే ఉన్నాయని, సమంత ఇంట్రడక్షన్ సీన్ చూస్తుంటే.. బాహుబలిలో తమన్నా ఇంట్రడక్షన్ సీన్‌లా అనిపిస్తోందని జనాలు కామెంట్లు పెడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సమంత మాత్రం మెస్మరైజ్ చేసింది. తన నటన, డబ్బింగ్‌తో పర్వాలేదనిపించింది. చాలా రోజులకు సమంత ఇలా కనిపించే సరికి ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చివర్లో అల్లు అర్హ ఎంట్రీ సైతం బాగానే అనిపించింది. కానీ దానికి కోసం చేసిన సీజీ వర్క్ తేలిపోయినట్టుగా అనిపించింది. శాకుంతలం సినిమా ట్రైలర్ మీద రష్మిక స్పందించింది. నెట్టింట్లో కామెంట్ పెట్టింది. రష్మిక కామెంట్‌కు సమంత సైతం స్పందించింది.


[[{"fid":"258926","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సమంత ఇప్పుడు శాకుంతలం ట్రైలర్ మీద తన అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు ముగ్దురాలైపోతోంది. సెలెబ్రిటీలు సైతం శాకుంతలం ట్రైలర్ మీద రియాక్ట్ అవుతున్నారు. ఈక్రమంలో రష్మిక మందన సైతం శాకుంతలం ట్రైలర్ మీద స్పందించింది. ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఆల్ ది బెస్ట్ సామీ అంటూ సమంతను ముద్దుగా పిలిచింది రష్మిక. ఇక రష్మిక నటించిన మిషన్ మజ్ను ట్రైలర్ మీద సమంత స్పందించింది.


మిషన్ మజ్ను ట్రైలర్‌ను చూశాను.. బాగుంది.. కంగ్రాట్స్ అంటూ రష్మిక కామెంట్‌కు సమంత రిప్లై ఇచ్చింది. మొత్తానికి ఇలా టాప్ హీరోయిన్లంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఇగోలు పక్కన పెట్టేసి ఉండటం శుభపరిణామమే. పుష్ప సినిమాలో సమంత ఐటం సాంగ్ చేయడం, పుష్పలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించడం అందరికీ తెలిసిందే.


Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్


Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి