Rashmika Mandanna: ఈరోజు ఉదయం నుంచి రష్మిక మందన్న మార్కెట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కోరుతూ వార్తల్లో నిలిచింది. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి కేంద్రమంత్రి వరకు ఈ వీడియో పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని పోస్ట్లు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయానికి వస్తే కొంతమంది ఆకతాయిలో వేరే వాళ్ళ వీడియోని డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో రష్మిక మందాన మొహం పెట్టి మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. సెలబ్రిటీస్ విషయంలోనే కాదు సాధారణమైన అమ్మాయిల విషయంలో కూడా ఇలాంటివి జరిగితే అవి వాళ్ళ మానసిక స్థితి పైన చాలా ప్రభావం చూపుతాయి అని.. అందుకే ఇలాంటి మార్ఫింగ్ వీడియోల పైన కఠిన చర్యలు తీసుకోవాలి అని అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఇలా చేసిన వారిని తక్షణమే శిక్షించాలి అంటూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం రష్మిక మోర్ఫెడ్ వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ వేశారు.


కాగా ఉదయం నుంచి ఈ వీడియో ఇంతగా వైరల్ అవుతుండటంతో ఈ విషయం పైన ఇంకా రష్మిక మందాన ఎందుకు స్పందించలేదు అని చాలామంది సందేహపడ్డాడు. ఇక ఇప్పుడు ఫైనల్ గా నెట్టింట వైరలవుతున్న వీడియో పట్ల రష్మిక మందన్నా స్పందించింది. టెక్నాలజీ ద్వారా ఇలాంటి పనులు చెయ్యడం తనకు నిజంగానే భయం వేస్తోంది అంటూ ఒక పెద్ద బహిరంగ లేఖ రాసుకొచ్చింది రష్మిక.



ట్వీట్‌లో రష్మిక ప్రస్తావిస్తూ..' ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇలాంటివి నాకే కాదు..టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి.. ప్రతి అమ్మాయికి చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక మహిళగా, నటిగా మాట్లాడుతున్నా. నాకు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను స్కూల్‌, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. అసలు నేను దీన్ని ఎలా తట్టుకోలగనో నా ఊహకు అందడం లేదు. ఇలాంటి వాటి బారిన మనలో ఎక్కువ మంది పడకముందే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి.' అంటూ రాసుకొచ్చింది.


ఇక ఇప్పుడు రష్మిక వేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.


Also Read: Anasuya: అలా చేయకపోవడం వల్లే హీరోయిన్ కాలేకపోయా.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook