Rashmika Social Media Post: వేదాంతం వల్లిస్తున్న రష్మిక.. భలే చెప్పింది బాసూ!
Rashmika Mandannas New life lesson: కన్నడ భామ రష్మిక మందన అక్కడ కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయి ఆ తరువాత తెలుగు. హిందీ బాషలలో సైతం స్టార్ క్రేజ్ తెచ్చుకుంది.
Rashmika Mandannas Life Lesson: కన్నడ భామ రష్మిక మందన అక్కడ కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. ఆ సినిమా అక్కడ హిట్ అవ్వడంతోటే తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి చలో సినిమాతో హీరోయిన్గా లాంచ్ చేయించారు.
ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె అక్కడ ఏకంగా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని తెలుగులో సినిమాలు చేసే పనిలో పడి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత బాలీవుడ్ లో కూడా లక్కు పరీక్షించుకునేందుకు అక్కడకి కూడా వెళ్ళింది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక కొటేషన్ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.
ఆమె తాజాగా తన ఫోటో ఒకదాన్ని షేర్ చేసి కోలుకో, నేర్చుకో, ఎదుగు, ప్రేమించు అంటూ నాలుగు పదాలు షేర్ చేసింది. ఆమె చెప్పింది ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. అదేమంటే గతంలోని నిరాశలను వదిలి ముందుకు వెళ్లాలని జీవితంలో ఎదురైన ప్రతి విషయం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలని, ఆ తర్వాత మంచి వ్యక్తులుగా ఎలా తయారవ్వాలో నేర్చుకోవాలని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటో షేర్ చేస్తున్న సమయంలో ఆమె చాలా ట్రెడిషనల్ గా కనపడుతూ చేతిలో ఒక ఆకుని కంటికి అడ్డం పెట్టుకొని షేర్ చేసింది.
Also Read: Vijay Devarakonda Samantha : టర్కీలో ఖుషీ టీం.. విజయ్ అలా సమంత ఇలా
ప్రస్తుతానికి ఆమె చేతిలో వరుస సినిమాలైతే ఉన్నాయి. అటు తెలుగులోనే మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఆమె హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో రూపొందుతున్న యానిమల్ సినిమా బాలీవుడ్ లో చేస్తుండగా రెయిన్బో అనే బాలీవుడ్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఇక తెలుగు విషయానికి వస్తే పుష్ప సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ప్రసాదానికి రెండో భాగం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి సినిమా యూనిట్ అయితే ఫోకస్ గా పనిచేస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుందనేది.
Also Read: Guntur Kaaram: 'గుంటూరు కారం'తో ఘాటెక్కిస్తున్న మహేష్ బాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook