Truth Behind Rashmika Mandanna to be banned in Karnataka: కన్నడ కస్తూరి రష్మిక మందన్న అతి తక్కువ కాలంలోనే కన్నడ సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఏకంగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ శెట్టి డైరెక్షన్లో రూపొందిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసిన రష్మిక మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఆమె ఆ తర్వాత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టకుండా బయటకు వచ్చేసింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిరిక్ పార్టీ సూపర్ హిట్ అయిన తర్వాత రష్మికకు తెలుగులో చలో సినిమా ఆఫర్ వచ్చింది. ఆ చలో సినిమా ద్వారా హిట్ అందుకున్న ఆమెకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఇక గీత గోవిందం అనే సినిమా ద్వారా ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం వల్ల రక్షిత్ శెట్టికి రష్మిక మందన్నకు మధ్య దూరం పెరిగిందని, వారిద్దరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు అనే ప్రచారాలను నేపథ్యంలోనే వారు నిజంగానే క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని మాత్రం కన్నడ సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక మందన్న బ్రేకప్ వెనుక విజయ్ దేవరకొండ అనే తెలుగు హీరో ఉన్నాడనే ఉద్దేశంతో ఆమెను విజయ్ దేవరకొండను ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూ వస్తూ ఉంటారు.


ఇప్పుడు తాజాగా మరోసారి రష్మిక మందన్న వ్యవహార శైలి వారిలో రచ్చ రేపింది. ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న గుడ్ బై అనే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేస్తున్న సమయంలో ఆమె తన డెబ్యూ మూవీ గురించి మాట్లాడుతూ రక్షిత్ శెట్టి గురించి కానీ ఆయన నిర్మించిన ఆ సినిమా నిర్మాణ సంస్థ గురించి కానీ ప్రస్తావించకుండా రెండు వేళ్ళు పైకెత్తి చూపుతూ సైగలు చేసింది. ఈ విషయం కన్నడ సినీ అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆమె మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.


వాటికి కొనసాగింపుగా కన్నడ సినీ థియేటర్స్ యజమానుల ఆర్గనైజేషన్ రష్మిక మీద బ్యాన్ విధించే ఆలోచన చేస్తున్నారని వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. కానీ అవేవీ నిజం కాదని తెలుస్తోంది. వాస్తవానికి ఒక హీరోయిన్ మీద బ్యాన్ విధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆమె చేస్తున్న సినిమాల విషయంలో ఏమైనా జాగ్రత్తలు పాటించక పోయినా లేదా మరొకరిని కించపరిచినా మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు.


కానీ ఇక్కడ ఆమె అలాంటి చర్యలకు పాల్పడలేదు. బహుశా అప్పటికప్పుడు తనకు ఆ పేరు గుర్తు రాకపోయి ఉండవచ్చని, ఆమె చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సినీ పరిశ్రమ లేదా థియేటర్లో యజమానుల సంఘం అయినా ఇలా హీరోయిన్ ని అకారణంగా బ్యాన్ చేయడం కుదిరే పని కాదు. సో ఈ వార్తలు అన్ని నిరాధారమైనవే అంటూ రష్మిక సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 


Also Read: Dil Raju Trolled : సిగ్గు -నీతి - మానం లేనిదే సినిమా అయితే, ఆ సంగతేంటి రాజు గారూ?


Also Read: Balakrishna- Boyapati : బాలయ్య-బోయపాటి మూవీ కోసం కొట్టుకుంటున్న ఆ నలుగురు టాప్ ప్రొడ్యూసర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook