Rashmika Mandanna - Vijay Devarakonda New Year Celebrations at Maldives: యంగ్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వీరు అప్పుడప్పుడూ ఖండిస్తూ వస్తున్నారు. అయితే అది ఖండన వరకే పరిమితం అవుతోంది. వారి ప్రేమకు ఊతం ఇచ్చే విధంగా వీరిద్దరూ చాలా సార్లు కలిసి కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఒకసారి మాల్దీవులకు వెళ్లేటప్పుడు విజయ్ దేవరకొండ పెట్టుకున్న గాగుల్స్ ఆ తర్వాత రష్మిక మందన ముఖాన కనిపించడంతో వీరిద్దరూ కలిసే వెకేషన్ కి వెళ్లారని అప్పట్లో ప్రచారం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే గతంలో ఒక పండుగ సందర్భంగా కూడా రష్మిక మందన విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్నట్లుగా అప్పట్లో కొన్ని ఫోటోలను మీడియా తెర మీదకు తెచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి వీరిద్దరూ ప్రేమ పక్షులు అని వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లారు అని అర్థం వచ్చేలా మరోసారి పోస్టులు పెట్టారు.


నూతన సంవత్సరాది సందర్భంగా అందరు తారలు తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టినట్లుగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక వందన ఇద్దరూ పోస్టులు పెట్టారు. అయితే ఆ ఇద్దరు ఫోటోలు పెట్టిన బ్యాగ్రౌండ్ ఒకలాగే ఉండడంతో ఖచ్చితంగా ఈ ఇద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్లారని మరోసారి ప్రచారం అయితే మొదలైంది. ఇక విజయ్ దేవరకొండ షాంపైన్ బాటిల్ తో వాటర్ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఒక ఏడాది చాలా సందర్భాలు వచ్చాయని గట్టిగా నవ్వామని, బాధతో లోలోపలే ఏడ్చాం, అనేక లక్ష్యాలను ఛేదించాం కొన్నింటిని గెలిచాము మరికొన్నింటిని ఓడిపోయాం అని పేర్కొన్నారు.  


మనం జీవితంలో ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతూ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క రష్మిక మందన కూడా తాను వాటర్ బేబీని అని చెబుతూ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా లొకేషన్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది మరోపక్క రష్మిక మందన కూడా చేతిలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 
Also Read: Ghost Motion Poster: వింటేజ్ స్టైల్లో 'ఘోస్ట్'..దుమ్ము రేపుతున్న మోషన్ పోస్టర్


Also Read: Sheezan Khan Suicide: తునీషా కేసులో నిందితుడికి సూసైడ్ భయం.. లాయర్ సంచలన ఆరోపణలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook