Rashmika Mandanna's First look out from Dulquer Salmaan, Hanu Raghavapudi's Movie: నేడు (ఏప్రిల్‌ 5) నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న పుట్టిన రోజు. మంగళవారం కన్నడ సోయగం 26వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరు రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఇటీవల పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక.. ప్రస్తుతం చేతినిండ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నారు. కన్నడ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మద్రాస్ మిలిటరీ లిటిరేట్ అధికారి అయిన దుల్కర్.. ప్రేమ కోసం ఎలా పోరాడాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‏గా నటిస్తున్నారు. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె పాత్రను రివీల్ చేసింది చిత్ర యూనిట్. 


దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక మందన్న కశ్మీరీ ముస్లిం అమ్మాయి ఆఫ్రిన్ పాత్రలో కనిపించనుందని మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'హ్యాపీ బర్త్ డే ఆఫ్రిన్' అని పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కన్నడ బ్యూటీ ధరించారు. ఆఫ్రిన్ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‍, కోలీవుడ్‏లో సత్తాచాటుతున్న రష్మిక.. ఈ సినిమాతో మాలీవుడ్‌లో కూడా స్టార్ కానున్నారు. 



'ఛలో' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన రష్మిక.. 'గీత గోవిందం' సినిమాతో స్టార్ డమ్ అందుకున్నారు. 'దేవ్ దాస్', 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. ముఖ్యంగా పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌ అయ్యారు. ఇటీవల రష్మిక నటించిన 'ఆడవాళ్లు  మీకు జోహార్లు' అంతగా ఆకట్టుకోలేకపోయింది. రశ్మిక ప్రస్తుతం 'పుష్ప-2'లో నటిస్తున్నారు. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన 'మిషన్ మజ్ను'లో, అమితాబ్ బచ్చన్ 'గుడ్ బై' సినిమాలోనూ నటిస్తున్నారు. 


Also Read: RR vs RCB: ఆర్‌సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌.. గ్లెన్ మాక్స్‌వెల్ ఔట్! కారణం ఇదే


Also Read: Revanth Reddy: అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు: రేవంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook