Ratan Tata Bollywood Movie Aetbaar: 10 లక్షల మందికి పైగా కార్మికులకు తన సంస్థల ద్వారా ఉపాధిని కల్పిస్తూ ఏకంగా రూ.3500 కోట్ల ప్రాపర్టీకి అధిపతి అయిన రతన్ టాటా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ వ్యాపార రంగంలో సాధించిన విజయాన్ని ఆయన ఇక్కడ పునరావృతం చేయలేకపోయారు అనేది వాస్తవం. పలు సంస్థల ద్వారా వేల రూపాయలను సొంతం చేసుకున్న రతన్ టాటా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. ఆ క్రమంలోనే ఒక సినిమా కూడా నిర్మించారు. మరి ఆ సినిమా ఏంటి..? దాని ఫలితం ఏంటి..? అనే విషయం ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అసలు విషయంలోకి వెళ్తే.. రతన్ నావల్ టాటా బుధవారం అక్టోబర్ 9 2024 రాత్రి 11:30 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు..పారిశ్రామికవేత్త , టాటా గ్రూప్ మాజీ చైర్మన్. దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. 



ఇకపోతే రతన్ టాటా కొంతకాలం చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.  2004లో విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఏత్ బార్ అనే రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ కి ఆయన సహనిర్మాతగా వ్యవహరించారు. 1996లో వచ్చిన అమెరికన్ సినిమా ఫియర్ స్ఫూర్తితో రూపొందించబడిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , జాన్ అబ్రహం , బిపాసా బసు,  సుప్రియ పిల్గాంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 


భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్యంగా డిజాస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను కూడా ఏమాత్రం రాబట్టలేకపోయింది.. ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా మళ్ళీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడి పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. అలా ఈ చిత్రమే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం. 


ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక కుమార్తె అతి క్రూరంగా ప్రవర్తించే ప్రియుడు గతాన్ని లోతుగా తవ్వడం ప్రారంభించిన తర్వాత.. కుమార్తె తండ్రి తో అతడికి సంబంధం ఉంది అన్నట్టుగా ఈ కథ సాగుతుంది. మొత్తానికైతే ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రతన్ టాటా కి ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పవచ్చు.


Also read: Bank Holidays 2024: ఆ 5 రోజులు బ్యాంకులకు సెలవులు, ఏ రాష్ట్రాల్లో ఎప్పుడు సెలవు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.