Rathnavelu on NTR 30 Set ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూనే వస్తోంది. ఈ మధ్యే గ్రాండ్‌గా సినిమాను లాంచ్ చేశారు. ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటివారిని ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ పిలిచాడు. ఈ ఈవెంట్లోనే కొరటాల శివ మొదటి సారిగా మాట్లాడాడు.ఆచార్య సినిమా తరువాత కొరటాల ఇచ్చిన స్పీచు అదే అయింది. అయితే సినిమా మీద కొరటాల ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపించింది. కొరటాల ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో చెప్పడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా కోస్టల్ ఏరియాలో ఉంటుందని, ఇందులో మనుషులుండరని, అంతా మృగాలే ఉంటాయని, వారు చావుకు, దేవుడికి కూడా భయపడరని, అలాంటి వారు ఒకరికి మాత్రం భయపడతారని ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.


 



ఈ సినిమా కోసం కొరటాల శివ అనిరుధ్, రత్నవేలు వంటి వారిని ఏరికోరి మరీ తీసుకున్నాడు. ఇక అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరింతగా ఎలివేట్ చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రత్నవేలు కెమెరా పనితనం, ఆయన విజువల్స్ ఎలా ఉంటాయో ఇది వరకే ఎన్నో సార్లు చూశారు. రోబో నుంచి రంగస్థలం వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలకు పని చేశాడు.


తాజాగా రత్నవేలు ట్వీట్ వేస్తూ.. ఎన్టీఆర్ ముప్పవ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఈ కాంబోలో పని చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను.. లైవ్‌లో ఇలా కరెంట్ తీగలాంటి వాడిని క్యాప్చర్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. వస్తున్నా అంటూ ఎన్టీఆర్ డైలాగ్‌ను రత్నవేలు కూడా వాడేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినట్టు అవుతోంది.


Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?


Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook