Ravi Teja: రవితేజ ప్లేస్ లో విశ్వక్ సెన్.. మొత్తానికి హీరోని మార్చేసిన డైరెక్టర్..
Vishwak Sen Upcoming Movies: జాతి రత్నాలు సినిమాతో.. మంచి పేరు తెచ్చుకున్న.. డైరెక్టర్ అనుదీప్. ఈ దర్శకుడు..ఆ తర్వాత మాత్రం హిట్ అందుకోలేకపోయాడు. రవితేజతో.. దాదాపు సినిమా ఓకే అయింది..కానీ అది కూడా క్యాన్సల్ అయిపోయింది. తాజాగా ఇప్పుడు.. రవితేజ స్థానంలో అనుదీప్ మరొక యంగ్ హీరోని..రంగంలోకి దింపాడు.
Ravi Teja-Anudeep Movie: యంగ్ డైరెక్టర్ అనుదీప్ కె.వి.. జాతి రత్నాలు సినిమాతో.. మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరుతో ప్రిన్స్ అనే సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో.. హిట్ అవ్వలేకపోయింది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న.. అనుదీప్ మీద చాలానే అంచనాలు ఉన్నాయి .
కానీ ప్రిన్స్ మాత్రం అవి అందుకోలేకపోయాడు. రెండవ సినిమాతో భారీ స్థాయిలో బోల్తాపడ్డ అనుదీప్ ఆ తర్వాత సినిమా ఆఫర్లు.. కూడా సరిగ్గా అందుకోలేకపోయాడు. అప్పటినుంచి కథని పట్టుకొని చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళాడు.. కానీ ఒకరు కూడా సినిమా చేయడానికి ముందుకు రాలేదు.
అదే సమయంలో మాస్ మహారాజా రవితేజ.. అనుదీప్ తో.. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో.. అనుదీప్ చెప్పిన కథలో సెకండ్ హాఫ్ నచ్చలేదు.. అని రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో అనుదీప్ కేవి కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లు అయింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు అనుదీప్ మరొక యంగ్ హీరోని.. రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు విశ్వక్ సేన్. ఈమధ్య వరుస డిజాస్టర్లతో.. సతమతం అవుతున్న విశ్వక్ ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో.. మరొక డిజాస్టర్ అందుకున్నారు.
తాజాగా ఇప్పుడు రవితేజ చేయాల్సిన ఈ సినిమాలో నటించడానికి.. విశ్వక్ సేన్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రవితేజ నో అన్న కథ.. విశ్వక్ సేన్ కి ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి. అభిమానులు సైతం రవితేజ వద్దు అన్న స్క్రిప్ట్.. అంటే బాగుండి ఉండకపోవచ్చు మరి అలాంటి సినిమాతో ఉపయోగం ఏముంది అని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా కూడా అనుదీప్ ముందు సినిమాల లాగానే.. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని సమాచారం. కచ్చితంగా ఈసారి హిట్ అందుకోవాలి అనే పట్టుదలతో ఉన్న అనుదీప్ కేవి, విశ్వక్ సేన్ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి.. ఈ సినిమాతో ఈ ఇద్దరు ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
Also Read: కాంగ్రెస్ లో నరాలు తేగే ఉత్కంఠ.. రేపే మంత్రి వర్గ విస్తరణ..?.. ఆషాడం ఎఫెక్ట్..
Also Read: డిప్యూటీ సీఎం పేరు చెప్పి రైతు సూసైడ్.. భట్టీకి చెక్ పెట్టేదిశగా పావులంటూ జోరుగా చర్చలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి