Ravanasura Pre Release Business: రావణాసుర సినిమా ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా..? హిట్ కొట్టాలంటే టార్గెట్ ఇదే!
Ravi Teja`s Ravanasura Pre Release Business: రవితేజ హీరోగా ఐదుగురు హీరోయిన్లతో స్క్రీన్ స్పేస్ పంచుకున్న చిత్రం రావణాసుర, ప్రమోషన్స్ తో ఆసక్తి ఏర్పరచుకున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్ తో పరిశీలిద్దాం.
Raviteja 'Ravanasura' Pre Release Business: రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవితేజ ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో స్క్రీన్ స్పేస్ పంచుకోవడమే కాదు, సుధీర్ వర్మ లాంటి డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమా ఎంత బిజినెస్ జరుపుకుంది? అనే విషయం ఒకసారి లుక్ వేద్దాం.
అయితే ముందుగా రవితేజ చివరి ఐదు సినిమాలు ఏ మేరకు మార్కెట్ జరుపుకున్నాయి అనే విషయం ఆయనకు వస్తే డిస్కో రాజా సినిమాకి 19 కోట్ల 20 లక్షలు మార్కెట్ జరిగింది. క్రాక్ సినిమాకి 17 కోట్లు, కిలాడీ సినిమాకి 22 కోట్ల 80 లక్షలు, రామారావు ఆన్ డ్యూటీ 17 కోట్ల 20 లక్షలు, ధమాకా సినిమాకి 18 కోట్ల 30 లక్షల మార్కెట్ జరిగింది. ఇక రావణాసుర సినిమా కూడా గట్టిగానే బిజినెస్ జరుపుకుంది. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమాని నైజాంలో ఏడు కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు.
సిడెడ్ ప్రాంతంలో మూడు కోట్లు, మిగతా ఆంధ్ర ప్రాంతం అంతా కలిపి 10 కోట్లు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ జరుపుకుంది. ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశం మాత్రమే కాదు ఓవర్సీస్ మొత్తం కలిపి రెండు కోట్ల 20 లక్షలకు ఈ సినిమా బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా 22 కోట్ల 20 లక్షల బిజినెస్ జరుపుకోవడంతో 23 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్ణయించారు. ఇక పాజిటివ్ టాక్ వచ్చి లాంగ్ రన్ అంటే శాకుంతలం లాంటి మరో పెద్ద సినిమా వచ్చేవరకు నిలబడగలిగితే ఈ కలెక్షన్స్ వెనక్కి రాబట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు.
Also Read: Aishwarya Divorce: ఐష్-అభిషేక్ విడాకులు.. అనూహ్యంగా తెర మీదకు కొత్త చర్చ!
ఇక ఈ సినిమాని అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా అలాగే రవితేజ ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్ మీద సంయుక్తంగా నిర్మించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని రవితేజ సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. పుష్ప సినిమాకి కథ అందించిన శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి కూడా కధ అందించడం విశేషం.
సినిమాలో రవితేజ సరసన దక్ష నగార్కర్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రవితేజ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని చూచాయగా చాటి చెప్పాయి. మరి చూడాలి రవితేజ రావణాసుర సినిమాతో హిట్టు అందుకుంటాడా? పెట్టిన డబ్బులు వెనక్కి రాబట్టుకుంటాడా? లేదా అనేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook