Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!
Dhamaka Twitter Review రవితేజ నటించిన ధమాకా చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్లో బొమ్మ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Ravi Teja Dhamaka Twitter Review రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ధమాకా సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నేటి ఉదయం నుంచి బొమ్మ పడటంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ చాలా పాతది అని కొంత మంది అంటుంటే.. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా, క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా తీశారంటూ.. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయ్ అని, రవితేజ శ్రీలల అద్భుతంగా నటించేశారంటూ నెటిజన్లు అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ ఇప్పుడే అయిపోయిందని ఓ నెటిజన్ ఇలా రిపోర్ట్ ఇచ్చేశాడు. ఇప్పటికి అయితే స్టోరీ మరీ బిలో యావరేజ్‌గా ఉందని, కొన్ని కామెడీ సీన్స్ తప్పా ఇంకేమీ సెట్ అవ్వలేదని, సెకండాఫ్ గొప్పగా ఉంటే తప్పా ఈ సినిమా ఆడదని, రవితేజ ఎనర్జీ మాత్రం అదిరిపోయిందని, శ్రీలీల పర్వాలేదని, సాంగ్స్ అయితే మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
అయితే రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది పండుగ లాంటి చిత్రమని తెలుస్తోంది. రవితేజ అభిమానులు హిట్ కొట్టేశామని సంబరపడిపోతోన్నారు. మీమ్స్‌లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ సగటు సినీ ప్రేక్షకుడు మాత్రం ఇంకో రకమైన తీర్పు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ధమాకా మరీ రొటీన్‌గా ఉందని, రవితేజ ఎప్పటిలానే ఎనర్జిటిక్‌గా నటించేశాడని, శ్రీలీల ఓకే అనిపిస్తుందని, మ్యూజిక్, ఆర్ఆర్ బాగా సెట్ అయిందని, కథ పాతదే అయినా కథనం వర్కౌట్ అయిందని, కొన్ని సీన్స్ బాగా వచ్చాయని, ఒకసారి చూడొచ్చు అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.
సినిమా గురించి ఎవరేం మాట్లాడినా మాత్రం కామన్‌గా కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. రవితేజ మాత్రం దుమ్ములేపేశాడని, శ్రీలల మళ్లీ తన మ్యాజిక్ చేసిందని, స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించిందని, మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయిందని, కొన్ని కామెడీ సీన్లు మాత్రం వర్కౌట్ అయ్యాయని చెబుతున్నారు. రొటీన్‌గా ఉన్నా ఈ వీకెండ్‌కు మాస్ ఆడియెన్స్‌కు ధమాకా మంచి ఆప్షన్ అయ్యేలానే ఉంది.
Also Read : Ram Charan RC15 Look : శంకర్ దిల్ రాజులకు మళ్లీ దెబ్బ.. రామ్ చరణ్ లుక్ లీక్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook