Ravanasura Day 1 Collection మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోన్నాడు. రావణాసుర సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నిన్న రిలీజ్ చేసిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. విలన్‌గా కనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఫస్ట్ హాఫ్‌లో విలన్‌గా మెప్పించిన రవితేజ.. ద్వితీయార్థానికి వచ్చే సరికి కథ పరమ రొటీన్‌గా మారిపోతుంది. మెడికల్ మాఫియా, ఫ్యామిలీ రివేంజ్ డ్రామా అంటూ రొటీన్ స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను మొత్తంగా 22 కోట్లకు అమ్మేసినట్టుగా తెలుస్తోంది. 23 కోట్ల షేర్‌ రాబట్టే టార్గెట్‌తో రావణాసుర బరిలోకి దిగింది. అయితే ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇందులో పాటలు, కామెడీ, ఎంటర్టైనర్ యాంగిల్స్ కూడా ఏమీ లేదు. ధమాకా సినిమాకు ఇదే కలిసి వచ్చింది. ధమాకా సినిమాలో ఊపు తెప్పించే పాటలు, శ్రీలీల అందాలు ఇలా అన్నీ కలిసి వచ్చాయి.


Also Read:  Akhil Akkineni Birthday : అఖిల్ బర్త్ డే.. ఇంకా కష్టపడుతున్న అక్కినేని హీరో.. అన్నీ అందని ద్రాక్షలానే?


కానీ రావణాసుర విషయంలో అలాంటివేమీ లేవు. విలన్‌గా, నెగెటివ్ షేడ్స్‌లో కనిపించడం మాత్రమే కొత్త పాయింట్. అయితే ఈ పాయింట్‌ను కూడా సరిగ్గా చూపించలేకపోయారు. విలనిజాన్ని ఫస్ట్ హాఫ్ వరకు మెయింటైన్ చేశారు. సెకండాఫ్‌లో రెగ్యులర్‌ హీరోలానే కనిపిస్తాడు. దీంతో సినిమా కాస్త రొటీన్‌ అనిపిస్తుంది. అందుకే సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.


దీంతో సినిమా కలెక్షన్ల మీద ప్రభావం పడినట్టు అనిపిస్తుంది. అయినా కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. రవితేజ బ్లాక్ బస్టర్‌ సినిమాలకు ఫస్ట్ డే ఎంత వచ్చాయో.. ఈ సినిమాకు కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి.


ఈ సినిమాకు మొదటి రోజు మొత్తంగా 7.85 కోట్ల గ్రాస్ రాగా.. 4.85 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి  4.2 కోట్ల షేర్, 6.7 కోట్ల గ్రాస్ వచ్చింది. ధమాకా సినిమాకు అయితే.. 4.66 కోట్ల వచ్చాయి. క్రాక్ సినిమాకు  6.2 కోట్లు వచ్చాయి. అలా రావణాసుర బెస్ట్ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Also Read: Allu Arjun Birthday : మెగా నీడలోంచి సొంత బ్రాండ్.. గంగోత్రి టు పుష్ప.. అల్లు అర్జున్‌ కెరీర్‌లో వివాదాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook