Ravi Teja's Khiladi movie OTT Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఖిలాడీ'. యాక్షన్ డ్రామా సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటించారు. ఖిలాడీ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డాక్టర్‌ జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్‌ స్టూడియోస్‌తో కలసి హవీష్‌ ప్రొడక్షన్‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఖిలాడి చిత్రం సరిగ్గా ఒక నెల తర్వాత ఓటీటీ ప్రీమియర్‌లకు సిద్ధంగా ఉంది. ఖిలాడీ చిత్రం మార్చి 11వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 'ఈ ఆటలో ఒక్కడే కింగ్‌, ఇంకా కొద్ది రోజులే వెయిటింగ్‌, ఫుల్‌ కిక్‌తో మార్చి 11న హాట్‌స్టార్‌లో మాస్‌ మహారాజ రవితేజ సినిమా ఖిలాడీ వస్తోంది' అని హాట్‌స్టార్‌ ఓ పోస్టర్ విడుదల చేసింది. దాంతో థియేటర్లలో సినిమా చూడని రవితేజ ఫాన్స్ సంబరపడుతున్నారు.



థియేటర్లలో ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన ఖిలాడీకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. గతేడాది క్రాక్ సినిమాతో మంచి హిట్ కొట్టిన మాస్ మహారాజా.. ఇటీవల విడుదలైన  ఖిలాడీ నిరాశనే మిగిల్చింది. ఇక 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాపైనే రవితేజ ఆశలు పెట్టుకున్నాడు. కొత్త దర్శకుడు శరత్‌ మందవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. 


Also Read: Viral Video: పెళ్లి ఊరేగింపులో 'శ్రీవల్లి' ఫీవర్.. హుక్ స్టెప్‌తో ఊగిపోయిన యువకులు! రచ్చ మాములుగా లేదుగా!!


Also Read: Ravindra Jadeja: సెంచరీ చేసిన జడేజా.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook