రాజా ది గ్రేట్ సినిమాతో సక్సెస్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ ఆ తర్వాత వచ్చిన 'టచ్ చేసి చూడు'తో అంత సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోయాడు. అయితే, అలాగని మన మాస్ మహారాజ అక్కడే ఏం ఆగిపోలేదు. వెంటనే స్పోర్టివ్ స్పిరిట్‌తో తన తర్వాతి చిత్రం షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై రవితేజ చాలా అంచనాలే పెట్టుకున్నాడు. అటు సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్ మీదున్న కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు అప్పుడే మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.


టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతోన్న సమాచారం ప్రకారం రవితేజ-కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ.25 కోట్లతో భారీ డీల్ కుదిరినట్టు సమాచారం. సన్ టీవీ నెట్ వర్క్ ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు టాక్. అదే కానీ నిజమైతే, రవితేజ తర్వాతి సినిమా ప్రొడక్షన్ స్టేజ్‌లో వుండగానే దాదాపు గట్టెక్కినట్టే అనుకోవచ్చు.