Ravi Teja remuneration: క్రాక్ మూవీ సక్సెస్ అవడంతో మాస్ మహారాజ రవితేజ మరోసారి ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రాక్ మూవీ (Krack movie) బ్లాక్ బస్టర్ అవడంతో ఆ తర్వాత సైన్ చేసే సినిమాలకు రవితేజ పారితోషికం అమాంతం పెంచేశాడట. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రవితేజ రూ. 17 కోట్లు వరకు ఛార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, రవితేజ గతంలో తీసుకునే పారితోషికం (Raviteja's remuneration per film) దృష్టిలో పెట్టుకుని ఆయనతో సినిమాలు చేద్దామని నిర్ణయించుకుని వచ్చిన నిర్మాతలు.. రవితేజ చెప్పే పారితోషికం విని చేతులెత్తుస్తున్నారని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రవితేజకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి అతడి క్రేజుకి ఆ రూ.17 కోట్లు పర్వాలేదు అనుకునే వారు తప్ప మిగతా నిర్మాతలు అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని వెనక్కి వెళ్లిపోతున్నారని టాలీవుడ్ టాక్. 


Also read : Manchu Vishnu, MAA association: మా అసోసియేషన్ ఎన్నికలు సమరంలో మంచు విష్ణు


అయితే, రవితేజ మాత్రం తన పారితోషికం విషయంలో అసలు తగ్గేదే లేదని గట్టిగానే నిర్ణయించుకున్నాడట. రవితేజనే నమ్ముకున్న నిర్మాతలకు కూడా కొదువ లేదు. బ్లాక్ బస్టర్స్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా మాస్ మహారాజ రవితేజ (Ravi Teja's next movies remuneration) చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉండటానికి కారణం కూడా అదే మరి.


Also read : Siggendukura Mama Song: సిగ్గెందుకురా మామా మాస్ సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook