Ravibabu - Poorna affair: నటి పూర్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. శ్రీమహాలక్ష్మీ సినిమాతో.. టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ముస్లిం యువతి అయినప్పటికీ.. తెలుగు అమ్మాయి లాగానే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కెరియర్ మొదట్లోనే తమిళ్, మలయాళ భాషల సినిమాలతో బిజీ అయిన పూర్ణ అల్లరి నరేష్ సరసన.. సీమ టపాకాయ్ సినిమాతో మళ్లీ తెలుగులో హిట్ అందుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సినిమాతో తెలుగులో కూడా ఈమె పేరు మళ్ళీ వినిపించింది. అలాగే ఆమెకి రవిబాబు.. దర్శకత్వంలో అవును సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది. అవును సినిమాతో పూర్ణ తెలుగు నటిగా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పూర్ణని చాలా కాలం..అవును భామ అనే పిలిచేవారు. 


అలా మంచి హిట్ అందుకున్న పూర్ణ మళ్ళీ రవిబాబు దర్శకత్వంలోనే అవును 2, లడ్డు బాబు, అదుగో అంటూ వరుసగా సినిమాలు చేసింది. దీంతో ఆమెకి నటిగా పేరొచ్చిందో లేదో పక్కన పెడితే.. రవిబాబుతో ఆమెకి అఫైర్ ఉందని మాత్రం పుకార్లు వచ్చాయి. అందుకే రవిబాబు తన ప్రతి సినిమాలో పూర్ణను.. హీరోయిన్ గా తీసుకుంటున్నాడని కొందరు పుకార్లు మొదలుపెట్టారు. 


ఈ వార్తలపై పూర్ణ సైలెంట్ గానే ఉంది కానీ రవిబాబు మాత్రం పలు సార్లు వీటిని కొట్టి పారేశాడు. తాజాగా కూడా ఒక ఇంటర్వ్యూలో మళ్లీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. "పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వల్ల అలాంటి పుకార్లు వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని మీడియా నిజం తెలుసుకోకుండా రాసి ఈ వార్తను వ్యాపించింది. అయినా ఆమె ఎక్కడో కేరళ లో ఉంటుంది. నేను ఇక్కడ.. అనవసరంగా మా ఇద్దరికీ లింక్ పెట్టారు" అని మళ్ళీ కొట్టి పారేశారు రవిబాబు.


"నా కథకు హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని నాకు క్లారిటీ ఉంటుంది. పాత్రకు సెట్ అయ్యే హీరోయిన్స్ నే సెలెక్ట్ చేసుకుంటాను. అవును సినిమాకు పూర్ణ పర్ఫెక్ట్ ఛాయిస్ కాబట్టి తనని తీసుకున్నాను. తను చాలా మంచి నటి.  హార్డ్ వర్క్ తో పని చేస్తుంది. ఆమె సీన్ చేస్తే వన్ మోర్ అడగడానికి కూడా నేను భయపడతాను" అని అన్నారు రవిబాబు.


"ప్రస్తుతం నేను రష్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాను. అందులో కూడా పూర్ణ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అది యాక్షన్ సినిమా. పూర్ణ డ్యాన్సర్ కాకుండా ఫైటర్ అయ్యుంటే కచ్చితంగా ఆమెనే తీసుకునేవాడిని" అని చెప్పుకొచ్చారు రవిబాబు. 


కాగా పూర్ణాకి ఈమధ్య పెళ్లయిన సంగతి తెలిసిందే. అయినా పూర్ణతో రవిబాబు మళ్ళీ సినిమా తీయాలని ఉంది అనడంతో ఈ మాటలు కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో ఇన్ని పుకార్లు వచ్చాక కూడా రవిబాబు మళ్ళీ.. ఆమెతోనే సినిమా చేయాలని అనుకుంటున్నారు. వాళ్లిద్దరి మధ్య స్నేహం వల్లే రవిబాబు పుకార్లను పక్కన పెట్టి ఆమెతో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.. అని మరి కొందరు చెబుతున్నారు.


Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..


Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter