Chiranjeevi -Raviteja: మరో మల్టీస్టారర్ కు సిద్దమైన చిరు-రవితేజ.. మైత్రీ మేకర్స్ కూడా రెడీ!
Raviteja and Chiranjeevi Multistarrer: మెగాస్టార్ చిరంజీవి రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు మరో సినిమా చేయాలని అభిలాష వ్యక్తం చేశారు రవితేజ. ఆ వివరాలు
Raviteja and Chiranjeevi to do a Multistarrer Again: మెగాస్టార్ చిరంజీవి రవితేజ కలిసి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతిహాసన్ రవితేజ సోషల్ కేథరిన్ థెరిసా నటించారు. ఇక ఇతర కీలక పాత్రలలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, సుబ్బరాజు, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, షకలక శంకర్, శ్రీనివాసరెడ్డి, ప్రదీప్ రావత్ వంటి వారు కనిపించారు.
ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ అందుకున్న నేపద్యంలో సినిమా యూనిట్ తాజాగా ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా మెగాస్టార్ రవితేజ చిరంజీవి సహా సినిమాలో కీలక పాత్రలు పోషించిన పలువురు నటీనటులు దర్శకుడు బాబీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పాల్గొన్నారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అదేమిటంటే అన్నయ్య ఇది కాదు కానీ మనిద్దరం కలిసి ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోలగోలగా ఉండాలి అని అంటే దానికి మెగాస్టార్ చిరంజీవి వెంటనే నేను రెడీ అంటూ కామెంట్ చేశారు. వెంటనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా మేము కూడా నిర్మించడానికి సిద్ధమంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా నిజంగా పట్టాలెక్కుతుందో లేదో తెలియదు.
కానీ నిజంగా పట్టాలెక్కితే బావుండు అంటూ అటు మెగాస్టార్ అభిమానులతో పాటు ఇటు మాస్ మహారాజ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వీళ్లిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని అప్పుడెప్పుడో అన్నయ్య సినిమా తర్వాత మళ్లీ వాల్తేరు వీరయ్యలో కలిసి కనిపించి కనువిందు చేశారని అదే ఒక ఫుల్ లెన్త్ మాస్ మసాలా మల్టీస్టారర్ ఎంటర్టైనర్ గనుక పడితే అన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని వారంతా కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇది నిజంగా పట్టాలెక్కే అవకాశం ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook