Raviteja and Siddu Jonnalagadda Making Maanaadu Remake in Telugu: ఈ మధ్యకాలంలో తెలుగులో విడుదలైన ఇతర బాషల డబ్బింగ్ సినిమాని కూడా మళ్లీ రీమేక్ చేసే ట్రెండ్ ఎక్కువైపోయింది. గతంలో తెలుగులో విడుదలైన ఒక సినిమాని పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేయగా అది డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఇక ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ అనే సినిమా ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలైనా సరే గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసి మంచి టాక్ తెచ్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం లూసిఫర్ కలెక్షన్స్ ని కూడా గాడ్ ఫాదర్ అందుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ఇప్పుడు మోహన్ బాబు కూడా అదే బాటలో ఇప్పటికే తెలుగులో విడుదలైన ఆండ్రాయిడ్ కట్టప్ప అనే సినిమాని రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే మరో తమిళ సినిమా రీమేక్ తెలుగులో తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు.


ఇప్పటికే తెలుగు వర్షన్ కూడా విడుదలైన మానాడు సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాలకు  దర్శకత్వం వహించిన దశరథ్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందే అవకాశం కనిపిస్తోంది. రవితేజ, సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని, స్క్రిప్ట్ అంతా ఆయన అందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది వెంకట్ ప్రభూ దర్శకత్వం వహించిన ఈ మానాడు సినిమా తమిళనాట సూపర్ హిట్గా నిలిచింది.


శింబు, ఎస్జె సూర్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ టైం లూప్ సినిమాకి తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి అప్లాజ్ లభించింది. ప్రస్తుతానికి ఈ సినిమా సోనీ లివ్ యాప్ లో అందుబాటులో ఉంది అయినా సరే మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వస్తే కానీ ఏ విషయాన్ని ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. 


Also Read: Salaar Kali Matha: అఖండ, కార్తికేయ 2 బాటలోనే సలార్.. గట్టిగానే ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్?


Also Read: Malavika Mohanan Pics: పొట్టి డ్రెస్సులో మాళవిక మోహనన్.. నెవర్ బిఫోర్ అనేలా మలయాళ బ్యూటీ గ్లామర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook