Raviteja Dhamaka's 3 Days Total Collections: రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం ధమాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ గా వ్యవహరించారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాకట్రీ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన అంటే గత శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత ఎందుకో సినిమా మీద మిశ్రమ స్పందన అయితే లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం అందరి అంచనాలను దాటేస్తూ ముందుకు వెళుతుంది. తాజాగా ఈ సినిమా మూడో రోజు కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మూడవరోజు కలెక్షన్లు మొదటి రోజు కలెక్షన్లు కంటే ఎక్కువ వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మొదటి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల 66 లక్షలు వసూలు చేస్తే రెండవ రోజు మూడు కోట్ల 53 లక్షలు వసూలు చేసింది.


ఇక మూడవరోజు ఐదు కోట్ల 18 లక్షలు వసూలు చేసి ఇప్పటివరకు మూడు రోజులకు గాను 13 కోట్ల 37 లక్షల షేర్ 22 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా నైజాం ప్రాంతంలో మూడవరోజు రెండు కోట్ల 28 లక్షలు వసూలు చేస్తే సీడెడ్ ప్రాంతంలో 91 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో 20 లక్షలు, గుంటూరులో 31 లక్షలు, కృష్ణాజిల్లాలో 34 లక్షలు, నెల్లూరు జిల్లాలో 17 లక్షలు కలిపి మొత్తం ఐదు కోట్ల 18 లక్షలు షేర్ తొమ్మిది కోట్ల ఐదు లక్షలు గ్రాస్ వసూళ్లు సాధించింది.


ఇక మూడవరోజు కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి కోటి పది లక్షల వసూలు చేస్తే ఓవర్సీస్ లో 90 లక్షల వసూలు చేసింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో 15 కోట్ల 37 లక్షల షేర్ 27 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల 30 లక్షలు చేయడంతో 19 కోట్లు బ్రేక్ ఈవెన్ గా నిర్ణయించారు. ఇంకా మూడు కోట్ల అరవై మూడు లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ అయితే దక్కించుకుంటుంది. 


Also Read: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు అప్లై చేసేందుకు నేడే ఆఖరు తేదీ.. అప్లై చేయండిలా!


Also Read: తల్లి కాబోతున్న తునీషా శర్మ?.. పోస్ట్ మార్టం రిపోర్టులో అన్ని విషయాలపై క్లారిటీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.