Razakar Movie: రజాకార్ సినీ నిర్మాతకు బెదిరింపులు.. సీఆర్పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీ
Producer Gudur Narayana Reddy: రజాకార్ మూవీ నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి కేంద్రం 1+1 సెక్యూరిటీని నియమించింది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్రం స్పందించి.. సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
Producer Gudur Narayana Reddy: యాట సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన రజాకర్ మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నిజాం కాలం నాటి పరిస్థితులు, రజాకార్ల ఆకృత్యాలను కళ్లకు కట్టేలా తీసిన ఈ మూవీ చుట్టూ మొదటి నుంచి వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల వేళ విడుదల కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రజాకార్ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకున్నా.. కొంతమంది మాత్రం ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి. తనకు బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటివరకు తనకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ.. ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఓ సినిమా నిర్మాతకు కేంద్రం సెక్యూరిటీ నియమించడం చర్చగా మారింది. మార్చి 15న ఆడియన్స్ ముందుకు వచ్చిన రజాకార్ మూవీకి రోజురోజుకు భారీ స్పందన వస్తోంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ, ఇంద్రజ కీలక పాత్రల్లో నటించారు. పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రజాకార్ సినిమా కమర్షియల్ మూవీ కాదన్నారు. మన చరిత్రను తెలియజేసే సినిమా అన్నారు. ఆ రోజుల్లో హిందువులపై రజాకార్లు చేసిన దాడులు, ఆకృత్యాలు, మత మార్పుడులు ఎలా జరిగేవి..? తదితర విషయాలు నేటి తరం యువత తెలుసుకోవాలనే ఉద్దేశంతో తీశామన్నారు. భవిష్యత్ తరాలకు ఒక పుస్తకంలాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని కోరారు. ఇప్పటికే చూసిన వారు మరో నలుగురిని తీసుకువెళ్లాలని.. మన తాతలు, ముత్తాతలు పడిన బాధలు, కష్టాలను అందరికీ తెలియజేయాలని కోరారు. రజాకార్లు అంటే ఎవరో తెలియన నేటి తరం వారు తప్పకుండా చూడాలని రిక్వెస్ట్ చేశారు.
Also Read: Kidnap Drama: 'ఇది బిగనర్స్ మిస్టేక్స్ చూసుకోవాలి కదా!'.. బెడిసికొట్టిన యువతి కిడ్నాప్ డ్రామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter