Ram Charan: రామ్ చరణ్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ..
Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో మెగాపవర్ స్టార్ కాస్త గ్లోబర్ స్టార్ అయ్యాడు. అందుకే ఇపుడు చేయబోయే ప్రతి సినిమాపై సెపరేట్‌గా కాన్సట్రేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంచర్` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయనున్నాడు. తాజాగా ఈ మూవీలో క్రేజీ భామను హీరోయిన్గా తీసుకోవడం దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు.
Ram Charan: దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో సత్తా చాటాడు. ఈ మూవీ తర్వాత శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు. అందుకు దారి తీసిన పరిస్థితులు అనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి.
ఆ సంగతి పక్కన పెడితే ఈ మూవీని ఎపుడు విడుదల చేస్తారానేది సస్పెన్స్‌గా మారింది. ఈ మూవీ చేస్తూనే.. కమల్ హాసన్‌తో 'ఇండియన్ 2' మూవీ చేస్తున్నాడు. అందుకే ఈ మూవీ విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్.. బుచ్చి బాబు సన దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేస్తున్నాడు. ఈ మూవీలో ముందు నుంచి హీరోయిన్గా పలువురు పేర్లు పరిశీలనకు వచ్చిన చివరకు ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేసినట్టు సమాచారం.
జాన్వీ కపూర్.. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రానుంది. ఫస్ట్ పార్ట్ ఈ యేడాది ఏప్రిల్‌లో అనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ కావడంతో ఈ మూవీని ఆగష్టు లేదా సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం. ఈ మూవీ విడుదల తేదిపై అఫీషియల్ ప్రకటన తరువాయి. అటు రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ పెయిర్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter