Pushpa 2: పుష్ప 2 ధియేటర్ లోకి దూసుకొచ్చిన పోలీసులు.. అసలు కథ ఏంటి?
Real life Pushpa: నాగపూర్‌లోని మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమా స్క్రీనింగ్ సమయంలో పోలీసుల దాడితో ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్ విశాల్ మేష్రామ్ అరెస్ట్ సీన్ అందరికీ షాక్ ఇచ్చింది. భారీ క్రిమినల్ రికార్డు ఉన్న మేష్రామ్ 10 నెలల ప్రయత్నాల తర్వాత అరెస్టు అయ్యాడు.
Gangster Arrestes in Pushpa 2: నాగపూర్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో పుష్ప 2 సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అనూహ్య సంఘటన ఎదురైంది. రాత్రి 12 గంటల తరువాత, సినిమా చివరి క్లైమాక్స్ సమయంలోనే పోలీసులు హాల్‌లోకి దూసుకెళ్లారు. దీనితో ప్రేక్షకులు అశ్చర్యానికి గురయ్యారు.
విశాల్ మేష్రామ్ అనే గ్యాంగ్‌స్టర్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. అతను 27 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండు హత్య కేసుల్లోనూ అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గత 10 నెలలుగా అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. అతను డ్రగ్ పెడ్లింగ్ కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
పోలీసులు విశాల్‌ను ట్రాక్ చేయడానికి సైబర్ సర్వైలెన్స్ ఉపయోగించారు. అతనికి ఇష్టమైన వాహనం థార్ SUV టైర్లను డిఫ్లేట్ చేసి పారిపోకుండా ప్లాన్ కూడా రూపొందించారు పోలీసులు. అతను పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి ఫ్యాన్ కూడా కావడంతో సినిమా చూడటానికి వచ్చి దొరికిపోయాడు.
సినిమా క్లైమాక్స్‌లో ఉండగానే, పోలీసుల టీమ్ సరిగ్గా ప్లాన్ చేసిన విధంగా అతనిని చుట్టుముట్టారు. హాల్‌లోకి వచ్చిన పోలీసులను చూసిన ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. విశాల్ పరారయ్యేందుకు ప్రయత్నించగా, వెంటనే అతన్ని బంధించారు. అరెస్ట్ అనంతరం ప్రేక్షకులకు అల్లు అర్జున్ బియర్డ్ బ్రష్ సీన్ చూడమని పోలీసులు చెప్పారు.
విశాల్ మేష్రామ్‌ను మొదట నాగపూర్ జైలుకు తరలించారు. త్వరలోనే అతన్ని నాసిక్ సెంట్రల్ జైలుకు పంపించనున్నారు. ఈ సినిమాతో ఆ ప్రాంతంలోని అత్యంత ప్రమాదకర క్రిమినల్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది.
ఇదీ చదవండి: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.