Reason Behind Bandla Ganesh targeting Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూరీ జగన్నాథ్ కరణ్ జోహార్ తో కలిసి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అక్కడికి హాజరైన జనాన్ని చూసి విజయ్ దేవరకొండ కాస్త ఎక్సైట్ అయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్సైట్ అయ్యి మా అయ్య ఎవరో తెలియదు మా తాత ఎవరో తెలియదు కానీ మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు నిరంతరం రుణపడి ఉంటాను అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఈ విషయం మీద చాలా చర్చలు జరిగాయి. కొంతమంది తాతలు తండ్రులు హీరోగా ఉన్న హీరోల గురించే విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడంటూ కొంతమంది హీరోల అభిమానులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి విజయ దేవరకొండ మాటలను ఖండించారు. అయితే సినీ పరిశ్రమ నుంచి ఎవరూ దాని గురించి స్పందించలేదు.


కానీ బండ్ల గణేష్ అనూహ్యంగా తాతలు తండ్రులు ఉన్నంత మాత్రాన టాలెంట్ లేకుండా హీరోలుగా నిలబడలేరు అంటూ కొంతమంది హీరోల పేర్లు ప్రస్తావించి కౌంటర్ ఇచ్చారు. అయితే ఎక్కడా కూడా విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించలేదు కానీ ఆ కౌంటర్ మాత్రం విజయ్ దేవరకొండకి అనే ప్రచారం అయితే ఉంది. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు అసలు విషయం ఏమిటంటే ఆయన ఈ కౌంటర్ ఇవ్వడానికి కాల కారణం విజయ్ దేవరకొండ కాదని పూరీ జగన్నాథ్ అని తెలుస్తోంది.


నిజానికి పూరీ జగన్నాథ్ తన కుమారుడిని సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ ఆయన కుమారుడు హీరోగా నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాక వాంపులు అంటూ చార్మి గురించి పరోక్షంగా ప్రస్తావించి పూరీ జగన్నాద్ ఆగ్రహానికి గురయ్యాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అంత చెప్పినా పూరి జగన్నాథ్ మళ్లీ జనగణమన సినిమా కాకుండా మరో సినిమా కూడా విజయ్ దేవరకొండతోనే చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారాలు జరుగుతున్నాయి.


ఈ  నేపథ్యంలో కావాలనే పూరి జగన్నాథ్ దృష్టిలో పడడం కోసమే విజయ్ దేవరకొండను ఇలా టార్గెట్ చేసి మాట్లాడారని అంటున్నారు. అలా అయినా పూరి జగన్నాథ్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి ఆయన కుమారుడికి మంచి భవిష్యత్తు ఉండేలాగా చేయాలని బండ్ల గణేష్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి కొంతమంది మాత్రం పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ ఇద్దరికీ కూడా విజయ్ దేవరకొండ తండ్రి మంచి స్నేహితుడు. అలాంటిది అలాంటి ఆయన కొడుకు గురించి ఎందుకిలా బండ్ల కామెంట్ చేస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో తెలియదు కానీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది.


Also Read: Liger: మైండ్ బ్లాకయ్యేలా లైగర్ ఓటీటీ-శాటిలైట్ డీల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?


Also Read: Anasuya bharadwaj:ఎట్టకేలకు జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై.. ఆ ప్రశ్నకు మౌనమే సమాధానం!


 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook