Reason Behind Mahesh not Removing Hair after Rituals to mother and father: సూపర్ స్టార్ మహేష్ బాబు తన జీవితంలో అత్యంత బాధాకరమైన ఫేజ్ లో ఉన్నాడు, ఒకే ఏడాదిలో ముందు సోదరుడు మరణించడం ఆ తర్వాత తల్లి, ఆ తర్వాత తండ్రి మరణించడంతో ఆయన తీవ్ర దుఃఖ పరిస్థితుల్లో ఉన్నారు. నిజానికి మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు నటించినప్పుడు ఆయన కుమారుడు రమేష్ బాబు కర్మకాండలు నిర్వహించాడు. ఆ తర్వాత మహేష్ తన తల్లికి కర్మ కాండ నిర్వహించి ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు కూడా కర్మకాండ నిర్వహించారు. వాస్తవానికి తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు ఉంటే తల్లికి చిన్న కుమారుడు తండ్రికి పెద్ద కుమారుడు తలకొరివి పెట్టాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతానికి మహేష్ బాబు ఒక్కరే ఉన్నారు. కాబట్టి తన తల్లికి తండ్రికి ఇద్దరికీ ఆయనే తల కొరివి పెట్టారు. అయితే తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన వ్యక్తి తలనీలాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మహేష్ బాబు కర్మకాండలు నిర్వహించారు. కానీ తలనీలాలు సమర్పించ కపోవడం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది . నిజానికి ఇందిరా దేవి మరణించిన సమయంలో మహేష్ బాబు తల నీలాలు సమర్పిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అప్పుడు ఆయన అలా చేయలేదు. ఇక కృష్ణ పెద్దకర్మ రేపు హైదరాబాద్ లో జెఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. రేపు కూడా మహేష్ బాబు తలనీలాలు సమర్పించే అవకాశం లేదని తెలుస్తోంది.


అయితే దానికి కారణం సినిమాలే అని అంటున్నారు మహేష్ బాబు వాస్తవానికి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. సాధారణమైన జుట్టు రావడానికే చాలా సమయం పడుతుంది అది కూడా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత జుట్టు రావడం అనేది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ మరోపక్క మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా లుక్కు పరంగా నీట్ గా కనిపించేందుకు మహేష్ బాబు తన లుక్ ని కూడా చేంజ్ చేయించుకున్నాడు, అదే విధంగా హెయిర్ కూడా స్టైల్ చేయించుకున్నాడు. ఇప్పుడు కర్మకాండ కోసం తలనీలాలు సమర్పిస్తే ఆ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తద్వారా నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు.


అందుకే నిర్మాతల కోసమే మహేష్ బాబు తన తలనీలాలు కూడా ఇవ్వకుండా తాను కట్టుబడిన దానికి నిబద్దతతో నిలబడ్డాడని తెలుస్తోంది. వాస్తవానికి పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సినిమా ప్రారంభించే సమయంలోనే నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకుంటారు. రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాము ఎన్ని రోజులు కాల్షీట్స్  కేటాయిస్తాం అనే విషయాలను అందులో పొందుపరుస్తారు.


అయితే మహేష్ బాబు లాంటి హీరో నేనిప్పుడు బాధలో ఉన్నాను సినిమా చేయలేను అని చెప్పినా ఎంత పెద్ద నిర్మాత అయిన నష్టాన్ని భరిస్తాడు కానీ పెదవి విప్పి మహేష్ బాబుని బలవంతం చేయలేడు. కానీ మహేష్ బాబు మాత్రం తన నిబద్ధతకు మారుపేరుగా నిలబడుతూ తలనీలాలు సమర్పించ లేదని తెలుస్తోంది. నిజానికి ఇది చిన్న విషయమే అయినా అనేక మందిలో ఈ ప్రశ్న తొలిచేస్తూ ఉండడంతో ఈ విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. 


Also Read: Harish Shankar : పవన్ దగ్గర ఆ విషయంలో ఫెయిలైన హరీష్ శంకర్.. ఫాన్స్ కు కొత్త టెన్షన్!


Also Read: Rashmika Mandanna: నోటి దురదకు భారీ మూల్యం..కన్నడ సినీ పరిశ్రమ నుంచి రష్మిక మందన్న బ్యాన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook