Reason for Krishnam Raju Death: సినీ హీరో ప్రభాస్ పెదనాన్న, ఒకప్పటి రెబెల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సినీ రంగం నుంచే కాక రాజకీయ రంగం నుంచి కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు పలువురు హీరోలు. నిఖిల్, మంచు మనోజ్ వంటి వారు ఇప్పటికే తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని వారి పవిత్ర ఆత్మకు సద్గధులు ప్రార్థించాలని భగవంతుని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KCR Condolences to Krishnm Raju: ఇక అలాగే ఆయన మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాలలో హీరోగా నటించి తన విలక్షణ నటన శైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాలలో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు కాగా ఒక కుమార్తె విదేశాల్లో ఉన్నారని ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు జరిపే అవకాశం లేదని తెలుస్తోంది.


అయితే కృష్ణంరాజు ఎలా చనిపోయారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేకపోయినా తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన పోస్ట్ కోవిడ్ కారణాలతోనే మరణించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నాక పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని అప్పటి నుంచి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. నిన్న రాత్రి సమయంలో ప్రభాస్ ఏఐజి హాస్పిటల్ లో కనిపించడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.


అయితే ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చిందని ఈ కారణంతోనే ఆయన తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. అయితే ఇదంతా ప్రచారమే కాగా ఆయన ఎలా మరణించారనే విషయం మీద ఏఐజీ హాస్పిటల్ మరికొద్ది సేపట్లో ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆ హెల్త్ బులియన్ విడుదలైతే గానీ ఆయన ఎలా మరణించారు అనే విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.


Also Read: Krishnam Raju: మీరెప్పుడూ చూడని రెబల్ స్టార్ కృష్ణంరాజు రేర్ ఫోటోలు...


Also Read: Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి