Rebel Star Krishnam Raju Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకప్పటి సినీ హీరో ప్రస్తుత సినీ హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు కన్నుమూసినట్లు తెలుస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన సినీ కెరియర్లో మొత్తం 183 సినిమాల్లో ఆయన నటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లో జనవరి 20 1940వ సంవత్సరంలో జన్మించిన ఆయన 1966లో చిలకా గోరింక అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.  తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రెబల్ స్టార్ అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు కృష్ణం రాజు. చివరిగా రాధేశ్యామ్ అనే సినిమాలో ఒక జ్యోతిష్యుడు పాత్రలో కనిపించారు ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.


గతంలో హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత 1991లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన. అప్పట్లో అయన కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత అదే పార్టీ నుంచి ఆయన నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేశారు. అయితే అప్పటి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అయిన ఆయన 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 99 మధ్యంతర ఎన్నికల్లో కూడా నరసాపురం నుంచి గెలవడమే కాక వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.


2004 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన అనారోగ్యం దృష్ట్యా కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక కృష్ణం రాజుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక తన సోదరుడు కుమారుడు ప్రభాస్ తన బాటలోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు. ఇక గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 


Also Read: Elimination in Bigg Boss 6: ఎలిమినేషన్స్ చివరి నిముషంలో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్


Also Read: Rakul Preet Singh Hospitalised: ఆసుపత్రి పాలైన రకుల్ ప్రీత్ సింగ్.. షాక్ లో అభిమానులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి