Salaar WW Closing Collections: `సలార్` వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్.. మొత్తం వచ్చింది ఇదే.. ?
Salaar WW Closing Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `సలార్`. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌లేని ప్రభాస్.. సలార్ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించిందంటే..
Salaar WW box office Closing Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. తొందర్లోనే 'కల్కి 2898AD' మూవీతో పలకరించబోతున్నారు. ఆ తరవాత 'ది రాజా సాబ్' మూవీ ఉండనే ఉంది. ఈ మూవీపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక కల్కి సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ప్రస్తుతం 'ది రాజా సాబ్' మూవీపై దృష్టి సారించారు. ఈ సినిమాలతో పాటు పాటు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీ చేయనున్నారు. ఈ మూవీ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత 'సలార్ 2' మూవీ ఉండనే ఉంది. ఈ మూవీ ఈ యేడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి.
ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేని రెబల్ స్టార్.. గతేడాది చివర్లో విడుదలైన 'సలార్' మూవీతో మళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ మినహా అన్ని భాషలకు సంబంధించిన సలార్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో గత వారం నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్లో నటించారు. లాస్ట్ ఇయర్ చివర్లో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపింది. ఇక కన్నడ,ఇతర భాషల్లో పెద్దగా ఆడలేదు. అటు హిందీలో టాక్‌కు తగ్గ వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది.
సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 347 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 333.43 కోట్ల షేర్ (రూ. 630.15 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. హిందీలో 'డంకీ' కారణంగా సరైన థియేటర్స్ దొరకలేదు. అది వసూళ్లపై ప్రభావం చూపించింది. అటు సలార్ మూవీ కన్నడలో హిట్టైన 'ఉగ్రం' మూవీకి రీమేక్. ఈ సినిమా అక్కడ ప్రేక్షకులు ఆల్రెడీ చేసేసిన సబ్జెక్ట్ కాబట్టి పెద్దగా ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 9.57 కోట్ల నస్టాలను చవిచూపింది. ఆల్మోస్ట్ 97 శాతం రికవరీ సాధించి సెమీ హిట్‌గా నిలిచింది.
మరోవైపు 'సలార్' మూవీ స్పానిష్ భాషలో డబ్ చేసిన మార్చి 7 లాటిన్ అమెరికా దేశాల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు 'సలార్' మూవీని జపాన్ దేశంలో సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
సలార్ స్టోరీ విషయానికొస్తే.. ఇద్దరు ప్రాణ స్నేహితులు..శత్రువులుగా ఎలా మారారనే కథతో తెరకెక్కింది. ఇక సలార్ రెండో పార్ట్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. రెండో పార్ట్‌కు 'సలార్'.. పార్ట్ 2 శౌర్యాంగ పర్వం' అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. ఇక సలార్ మూవీ నైజాం (తెలంగాణ) గడ్డపై రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన మూడో సినిమాగా సలార్ చిత్రం రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ విషయానికొస్తే.. షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' సినిమాతో పోటీ కారణంగా తక్కువ స్క్రీన్స్ దక్కాయి. అయినా.. అక్కడ కూడా మంచి వసూళ్లనే సాధించింది. అక్కడ ఈ మూవీ ఓవరాల్‌గా రూ. 150 కోట్ల నెట్ వసూళ్లతో దుమ్ము దులిపింది. ఓవరాల్‌గా రూ. 153.45 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు సమాచారం.
మొత్తంగా సినిమా హిందీలో రూ. 75 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టోటల్ రన్ ముగిసే సమయానికి హిందీలో రూ. 76.50 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకొని హిందీలో హిట్ స్టేటస్ అందుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 78 కోట్ల బిజినెస్‌కు రన్ కంప్లీట్ అయ్యేవరకు రూ. 80.90 కోట్ల రేంజ్‌ను చేసుకొని సొంతం చేసుకొని థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ మూవీ హిందీ సహా రెస్ట్ ఆఫ్ భారత్‌లో హిట్ అనిపించుకుంది.
Also read: FD Interest Rate: సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook