Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. `కల్కి 2898 AD` న్యూ రిలీజ్ డేట్ ఇదే.. ?
Prabhas Kalki New Release Date: రెబల్ స్టార్ ప్రభాస్ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `కల్కి` మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఎన్నికల కారణంగా వాయిదా పడింది. అధికారికంగా ప్రకటించక పోయినా.. తాజాగా మరో పవర్‌పుల్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం.
Prabhas Kalki New Release Date: ప్రభాస్ చేస్తోన్న ప్రతి సినిమా ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఏళ్లకు ఏళ్లు సాగుతున్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ కూడా ముందుగా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత మే 9 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ ఇయర్ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇతరత్రా కారణాల వల్ల ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే డేట్‌లో వైజయంతీ మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', మహానటి సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం 'కల్కి 2898 AD' మూవీ కూడా బ్లాక్ బస్టర్ డేట్ కే రిలీజ్ చేద్దామనుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉంది. ప్రజలందరి మూడో దానిపైనే ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 13న పోలింగ్ డేట్ ఉంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 9న విడుదల చేయడం డౌటే అని చెబుతున్నారు. పైగా ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ.. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ జూ 4 రిజల్డ్ డేట్ వరకు ఉంటుంది.
మరోవైపు కల్కి సినిమాకు ఎక్కువ డబ్బులు రావాలంటే ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయాల్సిందే. ప్రస్తుతం పోలీస్ ఇతర ప్రభుత్వ యంత్రాగం మొత్తం ఎలక్షన్స్ పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు స్పెషల్ షో పర్మిషన్స్.. రావడం కష్టమనే చెప్పాలి. అందుకే ఈ సినిమాను ఎన్నికల తర్వాత మంచి డేట్‌లో ఏ సినిమా పోటీ లేకుండా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాను మే 30న విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. అప్పటికే అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 1న చివరి విడత ఎన్నికలుంటాయి. ఈ సినిమా స్పెషల్ షో కోసం ఏపీలో ప్రభుత్వం నుంచి కాకుండా అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఆ డేట్ లో మరే పెద్ద సినిమాలు కూడా రావడం లేదు. పైగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈ డేట్ సేఫ్ అని చెబుతున్నారు. పైగా స్కూల్, కాలేజీలు ఈ సినిమా విడుదలైన వారం పది రోజులు వరకు సెలవులు ఉంటాయి. అది ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచే అవకాశాలున్నాయి.
కల్కిలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అటు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీటైంది.
ఇక 'కల్కి' మూవీ మహాభారతంతో మొదలై 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని 'కల్కి' మూవీలో చూపించబోతున్నారు. అంతేకాదు ఇందులో నాటి రోజులకు తగ్గట్టు భారతీయత ఉట్టిపడేలా ఓ కొత్త ప్రపంచాన్నే ఈ సినిమా యూనిట్ క్రియేట్ చేసిందని చెప్పారు. ఈ సినిమా తర్వాత ముందుగా మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీని కంప్లీట్ చేయనున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఉండనే ఉంది. అటు ఫైటర్ మూవీ దర్శకుడు సిద్ఘార్ధ్ ఆనంద్ మూవీ ఉంది. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయబోతున్నట్టు సమాచారం. అటు కన్నప్ప సినిమాలో ప్రభాస్.. మహా శివుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే కదా.
Also Read: KCR Arrest: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook