Prabhas - The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమాతో  గ్లోబల్ లెవల్‌కు పెరిగింది. ఆ తర్వాత వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అలరిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ ఫస్ట్ పార్ట్ 1 సీజ్ ఫైర్‌తో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇపుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' అంటూ సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో 6 వేల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాను మే 9న విడుదల కావాల్సింది. కానీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను నెలన్నర తర్వాత జూన్ 27న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో ప్రభాస్ 'భైరవ' పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆరు వేల యేళ్ల ప్రయాణాన్ని చూపించబోతున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌తో చిందేయనున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన..నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తైయింది. తాజాగా ఈ సినిమాలో ముగ్గురు భామలతో ప్రభాస్ చేయబోతున్న సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నట్టు సమాచారం. త్వరలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడితో పాటు సలార్ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగా సినిమాలు చేయబోతున్నాడు. అటు హిందీ దర్శకుడు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ యేడాది చివర్లో పట్టాలెక్కబోతుంది.


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి