Regina Cassandra Dating: రెజీనా కసాండ్రా.. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు తెలుగు ఆడియన్స్ హృదయాలు దోచుకున్న ప్రముఖ ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు కుర్ర హీరోల సరసన నటించి మంచి పేరు దక్కించుకున్న ఈమె..మధ్యకాలంలో ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. చివరిగా షాకిని డాకిని తో ప్రేక్షకులను అలరించిన రెజీనా చాలా రోజుల తర్వాత తెలుగులో ఉత్సవం పేరిట మరొకసారి తెలుగు ఆడియన్స్ ను  పలకరించబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా గతంలో సందీప్ కిషన్,  మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వంటి హీరోలతో ఈమె ఎఫైర్ నడుపుతోందంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఉత్సవం సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా కుర్ర హీరోలతో రిలేషన్షిప్,  ఎఫైర్ పై మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రమోషన్స్ లో భాగంగా మీకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి కదా.. ?ఏవి కూడా మీ హార్ట్ కు రీచ్ అవ్వలేదా?  అంటూ ప్రశ్నించారు. దీనికి రెజీనా చెప్పిన సమాధానం వింటే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. 


రెజీనా మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి. నేను కంటిన్యూగా డేటింగ్ చేస్తూనే ఉన్నాను. నేనొక సీరియల్ డేటర్ అంటూ చెప్పుకొచ్చింది.. అంటే చాలామందితో డేటింగ్ చేశానని చాలామందితో రిలేషన్ లో ఉన్నానని ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చింది. ఈ మాటలతో నెటిజన్లందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. అందుకే రెజీనా మగాళ్ళని 2 మినిట్స్ మ్యాగీ అని అందేమో అంటూ కౌంటర్లు వేస్తున్నారు.


నిజానికి షాకిని డాకిని వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మగాళ్ళంతా 2 మినిట్స్ మ్యాగీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాలను మళ్లీ నేటిజెన్లు వెలికితీస్తూ కౌంటర్లు వేస్తున్నారు.  మరి చాలా రోజుల తర్వాత ఉత్సవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెజినా మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుంది ఒకవేళ సక్సెస్ అయితే ఆఫర్లు వస్తాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది


Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం


Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.