Rajendra Prasad: అలనాటి హీరో రాజేంద్ర ప్రసాద్ ఆస్తులు కొట్టేసిన బంధువులు.. ఒక్కటీ తప్ప అన్నీ
Relatives Fraud To Actor Rajendra Prasad Assets: సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు వినోదం అందిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు బంధువులు రాబందులుగా తయారయ్యారు. ఆయన ఆస్తిన్నంతా కొట్టేశారు.
Rajendra Prasad Assets: తెలుగు సినీ పరిశ్రమలో పాత తరం.. కొత్త తరానికి పరిచయమైన నటుడు రాజేంద్రప్రసాద్. హీరోగా నవ్వులు పూయించిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం తండ్రి.. బాబాయ్ తదితర ముఖ్యపాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3 లాంటి సినిమాల్లో హీరోలకు సమానంగా పాత్రలు పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ జీవితంలో ఇటీవల తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఆయనకు మరో షాకింగ్ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అతడి ఆస్తినంతా నమ్ముకున్నవాళ్లే కొట్టేశారంట. రక్త సంబంధికులే తన ఆస్తిని కొట్టేశారని వాపోయారు. దీంతో ఒక్క భవనం మినహా తనకు ఆస్తులేమీ లేవని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుని బాధపడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Mechanic Rocky: 'ఒక్కొక్కడి ఇంజన్ తీసి కూష్మాండంలో బిగిస్తా'.. పవర్‌ఫుల్‌గా విశ్వక్ 'మెకానిక్ రాకీ'
1980-2000 మధ్యకాలంలో హీరోగా హాస్యభరిత సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో మెరుస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో హీరోకు సమానమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన కుమార్తె మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. అదే సమయంలో అతడి ఆస్తిని కూడా బంధువులు సాంతం నొక్కేసినట్లు తెలిసింది. నిర్మాతల వద్ద తనకు ఇంత పారితోషికం ఇవ్వాలని పట్టుబడని నటుల్లో రాజేంద్రప్రసాద్ ముందుంటారు. నిర్మాతలు ఇచ్చినంత పుచ్చుకుని సినిమాలు చేస్తున్న రాజేంద్రప్రసాద్ తనకు వచ్చిన సంపాదనలో కొన్ని ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నారు.
Also Read: Narudi Brathuku Natana: ‘నరుడి బ్రతుకు నటన’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే థియేటర్లలో సందడి
అయితే ఆస్తులన్నింటిని తన రక్త సంబంధికులే వాటిని తీసుకుని మోసం చేశారని తెలుస్తోంది. తన వద్ద ఇప్పుడు ఏమి లేవని విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఒక్క భవనం మాత్రమే మిగిలిందని రాజేంద్రప్రసాద్ వాపోయారు. 'నా అనుకున్న వారే నన్ను మోసం చేశారు' అంటూ ఓ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిర్మాతలను ఇబ్బంది పెట్టనని తెలిపారు.
అహనా పెళ్లంట, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆ ఒక్కటీ అడక్కు వంటి సినిమాలతో నేటి మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరూ, కల్కి వంటి సినిమాల వరకు రాజేంద్రప్రసాద్ చేశారు. మరికొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నారు. దాదాపు అందరు అగ్ర నటులతో రాజేంద్రప్రసాద్ పని చేశారు. ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు మొదలుకుని నేటి తరం వరకు రాజేంద్రప్రసాద్ అందరినీ చూశారు. తనకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.